పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలో బీజేపీ అధ్యక్షుడు నడ్డా కాన్వాయ్‌పై కొంతమంది దుండగులు దాడి చేసిన సంగతి తెలిసిందే. అలాగే రైతులు నిర్వహిస్తున్న నిరసనల కారణంగా అల్లర్లు జరిగే అవకాశాలున్నాయంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా అప్రమత్తం అయ్యారు. వెంటనే సీనియర్ పోలీసు అధికారులతో కీలక భేటీ నిర్వహించారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై షా అధికారులతో చర్చించారు.
రైతుల ఆందోళనను పొడగించడం, హింసకు పాల్పడే ఉద్దేశంతో రైతు సమూహంలోకి కొన్ని శక్తులు ప్రవేశించి, అల్లర్లకు పాల్పడే అవకాశాలున్నట్లు ప్రభుత్వానికి కొన్ని నివేదికలు అందాయి. దాదాపు పది గ్రూపులు రైతుల ఉద్యమంలోకి చొరబడి అల్లర్లు సృష్టించడానికి రెడీ అయిపోయాయని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదికలు అందించాయి. దీంతో కేంద్ర పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. రైతులకు సంబంధించిన ధర్నా కనుక ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలన్నారు. ఇక కోల్‌కతాలో జేపీ నడ్డాపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. దీనిపై విచారణ జరిపస్తామని తెలిపారు.