
తమిళనాడులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బాణసంచా తయారీ కేంద్రంలో ఒక్కసారిగా భారీ పేలుడు జరిగింది. భారీగా బాణసంచా పేలడంతో ఆ తయారీ కేంద్రంలో ఐదు గదులు నేల కూలాయి. దీంతో వాటి శిథిలాల కింద పడి బాణసంచా తయారీ కేంద్రంలో పని చేస్తున్న ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇంకొందరు కూలిన శిథిలాల కింద చిక్కుకున్నారు. శివకాశి జిల్లాలోని పుదుపట్టిలో ఉన్న బాణసంచా తయారీ కేంద్రంలో ఈ ప్రమాదం జరిగింది.
సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది, పోలీసులు, స్థానిక అధికారుల బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించాయి. ప్రమాదంలో గాయపడిన కార్మికులను అంబులెన్స్‌ల సహాయంతో సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను బయటికి తీసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…