Lions Roaming: అర్థరాత్రి వేళ హల్‌ చల్ చేస్తున్న సింహాలు.. సీసీ విజువల్స్ చూసి హడలిపోతున్న జనాలు..

Lions Roaming: పెరుగుతున్న జనాభా.. తరగిపోతున్న అడవి.. వెరసి.. జనావాసాల్లో ఉండాల్సిన మనుషులు అడవులను ఆక్రమిస్తుండటంతో..

Lions Roaming: అర్థరాత్రి వేళ హల్‌ చల్ చేస్తున్న సింహాలు.. సీసీ విజువల్స్ చూసి హడలిపోతున్న జనాలు..
Lions

Updated on: Dec 24, 2021 | 8:28 PM

Lions Roaming: పెరుగుతున్న జనాభా.. తరగిపోతున్న అడవి.. వెరసి.. జనావాసాల్లో ఉండాల్సిన మనుషులు అడవులను ఆక్రమిస్తుండటంతో.. అడవుల్లో ఉండాల్సిన క్రూర మృగాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. అయితే, ఇక్కడ అడవులకేం కొదవ లేదు. అయినా గానీ అవి జనావాసాల్లోకి వచ్చాయి. ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇంతకీ ఏం వచ్చాయి.. జనాలు ఎందుకు భయపడుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. తినడటానికి ఏం దొరకలేదో.. లేక దారితప్పి వచ్చాయో తెలియదు గానీ.. గుజరాత్‌లో సింహాలు జనావాసాల బాట పట్టాయి. ప్రజలు నివసించే ప్రాంతాల్లో సంచరిస్తూ వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

గుజరాత్ లో సింహాలు హల్చల్ చేస్తున్నాయి. అడవులను వదిలి గ్రామాల్లోకి వచ్చి దాడులు చేయడం కలకలం రేపుతోంది. అమేలి జిల్లాలోని ఓ గ్రామంలోకి సింహం ప్రవేశించింది. ఇది గమనించిన ఆవుల మందలు ఒక్కసారిగా పరుగులు తీశాయి. ఆవులను వెంటాడిన సింహం.. ఓ ఆవు దూడపై దాడి చేసింది. పక్కనున్న ఆవులు దగ్గరకు రావడంతో.. సింహం పరుగెత్తింది. కానీ అప్పటికే ఆవుదూడ చనిపోయింది. అక్కడున్న సీసీ ఫుటేజీలో ఈ విజువల్స్ రికార్డయ్యాయి.

అదే రాష్ట్రంలోని జునాగఢ్ జిల్లాలోనూ సింహాలు అలజడి సృష్టించాయి. అర్ధరాత్రి గ్రామంలోకి ప్రవేశించిన రెండు సింహాలు వీధుల వెంట తిరుగుతూ.. ఓ ఇంటి ఆవరణలో ఉన్న ఆవుపై దాడి చేసేందుకు ప్రయత్నించాయి. ఆవుకు సింహాలకు మధ్య చాలా సేపు పోరు సాగింది. అయితే ఆ ఆవు ధైర్యంగా వాటిని ఎదురించడంతో.. సింహాలు వెనక్కి తగ్గాయి. ఈ విజువల్స్ కూడా అక్కడున్న సీసీ ఫుటేజీలో రికార్డయ్యాయి.

అడవిలో ఉండాల్సిన సింహాలు ఇలా జనావాసాల్లోకి రావడంతో.. స్థానికులు భయంతో వణికిపోతున్నారు. అర్ధరాత్రి గ్రామాల్లో సింహాలు తిరగడంతో ఆందోళన చెందుతున్నారు. ఎవరైనా మనుషులు ఒంటరిగా చిక్కితే పరిస్థితి ఏంటనే భయం స్థానికుల కళ్లలో కనిపిస్తోంది. సింహాలు తిరుగుతున్న వీడియోలు సీసీ ఫుటేజీలో రికార్డ్ కావడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫారెస్ట్ అధికారులు స్పందించి.. తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Also read:

TTD Darshan Tickets: బాప్‌రే ఇంత డిమాండా?.. 55 నిమిషాల్లో 4.60 లక్షల టికెట్ల బుకింగ్..!

Corruption in Collectorate: కలెక్టర్‌ ఆఫీస్‌‌లో నోట్ల కట్టలు.. ఊహించని షాక్ ఇచ్చిన ప్రభుత్వం.. పూర్తి వివరాలివే..!

Greenko: వరల్డ్‌లోనే టాప్‌-3 ర్యాంక్ సాధించిన గ్రీన్‌కో.. తొలి భారతీయ కంపెనీగా సరికొత్త రికార్డ్..