TV9 Global Summit: రేపటి నుంచి TV9 థాట్‌ ఫెస్ట్‌.. ‘విశ్వగురు- భారత ప్రయాణం’ పై ప్రసంగించనున్న స్టార్‌ స్పీకర్లు..

TV9 Global Summit: TV9 నెట్‌వర్క్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న థాట్‌ పెస్ట్‌ 'వాట్ ఇండియా థింక్స్(What India Thinks Today) – గ్లోబల్ సమ్మిట్’  శుక్రవారం (జూన్‌17) ప్రారంభ కానుంది. న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్‌ వేదికగా రెండు రోజుల పాటు ఈ గ్లోబల్ సింపోజియమ్‌ జరగనుంది..

TV9 Global Summit: రేపటి నుంచి TV9 థాట్‌ ఫెస్ట్‌.. 'విశ్వగురు- భారత ప్రయాణం' పై ప్రసంగించనున్న స్టార్‌ స్పీకర్లు..
Tv9 Global Summit
Follow us

| Edited By: Team Veegam

Updated on: Jun 17, 2022 | 11:28 AM

TV9 Global Summit: TV9 నెట్‌వర్క్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న థాట్‌ పెస్ట్‌ ‘వాట్ ఇండియా థింక్స్(What India Thinks Today) – గ్లోబల్ సమ్మిట్’  శుక్రవారం (జూన్‌17) ప్రారంభ కానుంది. న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్‌ వేదికగా రెండు రోజుల పాటు ఈ గ్లోబల్ సింపోజియమ్‌ జరగనుంది. ‘విశ్వ గురు: ఇంకెంత దూరంలో’ అనే ధీమ్‌తో జరిగే ఈ కార్యక్రమానికి 14 మంది కేంద్ర క్యాబినేట్‌ మంత్రులతో పాటు ముగ్గురు సీఎంలు హాజరుకానున్నారు. భారతదేశం ‘విశ్వ గురువు’ గా మారాలనే ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడంపై వీరు తమ ఆలోచనలను పంచుకోనున్నారు. వీరితో పాటు పలువురు ప్రముఖులు వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ‘సెక్యూరింగ్ ఇండియా: టుడే అండ్ టుమారో’ అనే అంశంపై కీలకోపన్యాసం చేయనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ‘న్యూ ఇండియా మేకింగ్’పై ప్రసంగించనున్నారు. అలాగే నితిన్ గడ్కరీ, స్మృతి ఇరానీ, హర్దీప్ ఎస్ పూరి, జి కిషన్ రెడ్డి, అశ్విని వైష్ణవ్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, గజేంద్ర సింగ్ షెకావత్, ప్రహ్లాద్ జోషి, భూపేందర్ యాదవ్, మహేంద్ర పాండే, అనురాగ్ ఠాకూర్ తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. టీవీ9 గ్రూప్ నిర్వహిస్తోన్న ఈ మొదటి గ్లోబల్ సింపోజియమ్‌లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మేఘాలయ సీఎం కాన్రాడ్ కె సంగ్మా, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పాల్గొననున్నారు. అదేవిధంగా UK మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్, ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ తో సహా 75 మంది స్టార్ స్పీకర్లు ఈ సమ్మిట్‌కు హాజరుకానున్నారు. ‘ఇండియా ఇన్ ది న్యూ ఇంటర్నేషనల్ ఆర్డర్’ అనే విషయంపై డేవిడ్ కామెరూన్ ప్రసంగించనుండగా.. హమీద్ కర్జాయ్ ‘టెర్రరిజం: ఎనిమీ ఆఫ్ హ్యుమానిటీ’ అనే అంశంపై ప్రసంగించనున్నారు.

ఈ గ్లోబల్‌ ‘సింపోజియంలో ప్రధానంగా దేశ రాజకీయాలు, ఈ- గవర్నెన్స్, ఎకనమిక్స్, ఆరోగ్య సంరక్షణ, సంస్కృతి, క్రీడల రంగాలకు చెందిన వివిధ అంశాలపై చర్చ జరగనుంది. ఇందుకోసం అత్యంత ప్రభావవంతమైన, విశిష్ట అంతర్జాతీయ, జాతీయ స్థాయి వక్తలను ఒకే వేదికపైకి తీసుకువస్తోంది. ఇందులో భాగంగా రెండు రోజుల పాటు 75 మంది స్టార్ స్పీకర్లకు ఆతిథ్యం ఇవ్వనున్నట్లు TV9 నెట్‌వర్క్ ఒక ప్రకటనలో వెల్లడించింది. అవకాశాలు, ప్రతికూల సమయాల్లో భారత్ కొత్త ప్రపంచ క్రమాన్ని ఎలా విజయవంతంగా ఎదుర్కొంది అనే దానిపై చర్చలు జరుగనున్నట్లు TV9 పేర్కొంది. కాగా విశ్వగురువుగా ఎదిగేందుకు భారత్ చేస్తున్న ప్రయాణానికి సంబంధించిన బ్లూప్రింట్‌పై ఈ థాట్‌ఫెస్ట్ నిర్వహించబడుతోందని TV9 CEO బరున్ దాస్ పేర్కొన్నారు. భారతదేశ ప్రయాణం సవాళ్లు లేనిది కాదని, కానీ.. లక్ష్యం అంతకంటే పవిత్రమైనదని బరున్ దాస్ అన్నారు. ప్రతిష్ఠాత్మకమైన, బలమైన నాయకత్వం, సమష్ఠి సంకల్పం మొత్తం దేశాన్ని నిబద్ధతతో నడుపబడుతోందని వ్యాఖ్యానించారు. భారతదేశం ‘విశ్వ గురువు’గా మారాలనే ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడానికి స్వేచ్ఛా వాతావరణంలోని చర్చల ద్వారా ఆలోచనలను రూపొందించడమే.. ఈ ఈవెంట్ అంతిమ లక్ష్యమని దాస్ స్పష్టం చేశారు.

Tv9 Global Summit

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు