TV9 Festival of India: సాచెట్-పరంపర లైవ్ షో.. షాన్ చార్ట్‌బస్టర్ హిట్స్‌తో దుమ్మురేపనున్న టీవీ9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా..

TV9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈ సారి అంతకుమించి అన్న చందంగా జరగనుంది. ఇప్పటికే రెండు సెషన్స్ విజయంతంగా జరగ్గా.. మూడో సీజన్ సందడి మరికొన్ని రోజుల్లో మొదలుకానుంది. బాలీవుడ్ సంగీత సంచలనం సాచెట్-పరంపర సెప్టెంబర్ 28న లైవ్ షోతో దుమ్ము రేపనున్నారు. అక్టోబర్ 1న 'గోల్డెన్ వాయిస్ ఆఫ్ ఇండియా' షాన్ తన చార్ట్‌బస్టర్ హిట్స్‌తో అలరించనున్నారు.

TV9 Festival of India: సాచెట్-పరంపర లైవ్ షో.. షాన్ చార్ట్‌బస్టర్ హిట్స్‌తో దుమ్మురేపనున్న టీవీ9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా..
Tv9 Festival Of India

Updated on: Sep 15, 2025 | 5:17 PM

దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న TV9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా తిరిగి వచ్చేసింది. గతంలో కంటే పెద్దగా, ఇంకా గ్రాండ్‌గా ఈసారి మూడో ఎడిషన్ జరగనుంది. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియం వేదికగా సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 2 వరకు ఐదు రోజుల పాటు ఈ మెగా ఫెస్టివల్ నడవనుంది. మ్యూజిక్, డ్యాన్స్, రుచికరమైన ఆహారంతో ఈ ఉత్సవం ప్రేక్షకులను అలరించనుంది. ఇది కేవలం ఒక ఈవెంట్ మాత్రమే కాదు.. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో ఫుల్ ఎంజాయ్ చేయడానికి పర్‌ఫెక్ట్ ప్లేస్.

ఏం మిస్ అవ్వకూడదు?

ఈ ఫెస్టివల్‌లో బోలెడన్ని అట్రాక్షన్స్ ఉన్నాయి. బాలీవుడ్ మ్యూజిక్, దాండియా డ్యాన్స్, దుర్గా పూజ.. ఇవన్నీ ఒకే దగ్గర ఉండడం ఈ ఫెస్టివల్ స్పెషాలిటీ. బాలీవుడ్ సంగీత సంచలనం సాచెట్-పరంపర సెప్టెంబర్ 28న లైవ్ షోతో దుమ్ము రేపనున్నారు. అక్టోబర్ 1న ‘గోల్డెన్ వాయిస్ ఆఫ్ ఇండియా’ షాన్ తన చార్ట్‌బస్టర్ హిట్స్‌తో అలరించనున్నారు. సెప్టెంబర్ 29, 30, అక్టోబర్ 2 తేదీల్లో ప్రముఖ డీజేలు సాహిల్ గులాటి, DJ D’Ark తమ బీట్స్‌తో దాండియా నైట్స్‌ను ఒక రేంజ్‌కు తీసుకెళ్లనున్నారు.

లైఫ్ స్టైల్ ఎక్స్‌పో – ఫ్రీ ఎంట్రీ

ఉదయం 10 గంటల నుంచి మొదలయ్యే లైఫ్‌స్టైల్ ఎక్స్‌పోలో ఫ్యాషన్, టెక్నాలజీ, జ్యువెలరీ, ఇంకా చాలా స్పెషల్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. దీనికి ఎటువంటి ఎంట్రీ ఫీజు లేదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ ఈ ఫెస్టివల్‌లో ఉంటాయి. ఫుడ్ లవర్స్‌కు ఇది ఒక పండగలా ఉంటుంది. ఢిల్లీలో ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా, అత్యంత ఎత్తైన, కళాత్మకమైన దుర్గా పూజ పండల్‌ను ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు.

ఒకే వేదికపై సంప్రదాయం – ఆధునికత

ఈ మెగా ఫెస్టివల్ దేశ సంస్కృతి, సంప్రదాయం, ఆధునికతను ఒకే వేదికపైకి తీసుకొస్తుందని TV9 నెట్‌వర్క్ COO కె.విక్రమ్ తెలిపారు. ఇది TV9 స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని తెలిపారు. ఈసారి లైవ్ మ్యూజిక్, సెలబ్రిటీ దాండియా నైట్స్, దుర్గా పూజ వేడుకలతో సందడి మరింత పెంచనున్నట్లు తెలిపారు. లైఫ్ స్టైల్ స్టాల్స్‌లో అంతర్జాతీయ బ్రాండ్‌లను కూడా ప్రదర్శించనున్నట్లు తెలిపారు.

ఇవి గుర్తుంచుకోండి..

లైఫ్‌స్టైల్ షాపింగ్ ఎక్స్‌పో & మహా దుర్గా పూజ: సెప్టెంబర్ 28 – అక్టోబర్ 2

సాచెట్ – పరంపర లైవ్ ఇన్ కాన్సర్ట్ – 28వ సెప్టెంబర్, 7PM నుండి

షాన్ లైవ్ ఇన్ కన్వర్ట్ – అక్టోబర్ 1, 7 PM నుండి

దాండియా నైట్స్ –  29వ తేదీ (DJ సాహిల్ గులాటి), సెప్టెంబర్ 30, అక్టోబర్ 2 – (DJ D’Ark)

మీ కన్సర్ట్ , దాండియా టిక్కెట్లను BookMyShowలో మాత్రమే ఇప్పుడే బుక్ చేసుకోండి .

లైఫ్‌స్టైల్ ఎక్స్‌పోకు ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉచిత ప్రవేశం కలదు.

అప్‌డేట్‌లు, సమాచారం  కోసం.. https://www.tv9festivalofindia.com/ ని సందర్శించండి.