AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BMW Crash in Delhi: రోడ్డుపై నిర్లక్ష్యంగా BMW కారు డ్రైవింగ్‌.. కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ మృతి!

ఢిల్లీలో కారు- బైకు ఢీకొన్న ఘటనలో ఒకరు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ నవ్‌జోత్ సింగ్​ దుర్మరణం పాలయ్యారు. ఆయన భార్య ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ప్రమాద సమయంలో కారు నడుపుతున్న వ్యక్తి ఓ మహిళగా పోలీసులు గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం..

BMW Crash in Delhi: రోడ్డుపై నిర్లక్ష్యంగా BMW కారు డ్రైవింగ్‌.. కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ మృతి!
Delhi BMW crash issue
Srilakshmi C
|

Updated on: Sep 15, 2025 | 5:43 PM

Share

ఢిల్లీ, సెప్టెంబర్ 15: కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీగా విధుల నిర్వహిస్తున్న నవ్‌జోత్ ఆయన భార్య కలిసి ఆదివారం ఓ గుడికి వెళ్లారు. దర్శనం అనంతరం తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్దరించారు. కాంట్​ మెట్రో స్టేషన్​ సమీపంలోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న బైక్​ను వెనుక నుంచి వచ్చిన బీఎండబ్ల్యూ కారు బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్​పై ప్రయాణిస్తున్న నవజోత్​ సింగ్​ ఆయన భార్య తీవ్రంగా గాయపడ్డారు. కారులో ఉన్న వ్యక్తులకు స్వల్ప గాయాలు అయ్యాయని, వారే బాధితులను ఆసుపత్రిలో చేర్పించారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నవ్‌జోత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన భార్య పరిస్థితి విషమంగానే ఉందని తెలుస్తోంది. ఈ ఘటనతో బాధిత కుటుంబం, నవ్​జోత్​ సహచరులు విషాదంలో మునిగిపోయారు.

ఆ ఆసుపత్రిలో ఎలాంటి సౌకర్యాలు లేవు.. అందుకే నా తండ్రి మృతి

ఈ ఘటనపై నవ్​జోత్​ కుమారుడు మీడియాతో మాట్లాడారు. తన తల్లిదండ్రులకు యాక్సిడెంట్ జరిగిందని, జీటీబీ నగర్​లోని నులైఫ్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని బంధువులు ఫోన్​చేసి చెప్పారన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత తన తల్లిదండ్రులను 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రిలో చేర్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. ధౌలా కువాన్​ నుంచి ఎయిమ్స్​కు సమీపంలో సూపర్​స్పెషాలిటీ హాస్పిటళ్లు ఉన్నాయని, అక్కడికి తీసుకెళ్లి ఉంటే తన తండ్రి బతికే వారని అన్నారు. ఆ ఆసుపత్రిలో ఎలాంటి సౌకర్యాలు లేవని ఆయన తెలిపారు. ఆసుపత్రిలో చేర్పించిన కొద్దిసేపటికే తన తండ్రి మరణించినట్లు ప్రకటించారని తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మహిళ, ఆమె భర్త కూడా ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.

ప్రమాద దాటికి పూర్తిగా ధ్వంసమైన బైక్- నుజ్జు నుజ్జైన కారు ముందుభాగం ​

హరినగర్‌లో నివసిస్తున్న నవ్​జోత్ ఆర్థిక మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. మోటారు సైకిల్​ను ఢీకొన్న సమయంలో బీఎండబ్ల్యూ కారు ఒక మహిళ నడుపుతోందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారని వారు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత కారు నడుపుతున్న మహిళ, ఆమె భర్త బాధితులను టాక్సీలో ఆసుపత్రికి తీసుకెళ్లారని తెలిపారు. ప్రమాదం దాటికి బైక్​ పూర్తిగా ధ్వంసమైందని, ప్రస్తుతం రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. క్రైమ్​బృందం ప్రమాద స్థలాన్ని పరిశీలించిందని, దర్యాప్తు కోసం ఫోరెన్సిక్​సైన్స్​లాబోరేటరీ బృందాన్ని కూడా పిలిపించామని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
దిన ఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్
దిన ఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!