
బెంగళూరులో పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ (TTP)తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై పశ్చిమ బెంగాల్‌కు చెందిన 25 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగస్టు 11న బొమ్మసంద్ర ఇండస్ట్రియల్ ఏరియాలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అసఫుల్ మాలిక్ బిన్ అబెద్ మాలిక్ బెంగళూరులోని జిగానిలో నివాసం ఉంటూ టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్‌కు చెందిన సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అతడి అనుమానాస్పద డిజిటల్ కార్యకలాపాలపై సమాచారం అందడంతో పోలీసులు నిఘా పెట్టినట్లు తెలిపారు. దర్యాప్తులో మాలిక్‌కు ఫేస్‌బుక్ ద్వారా ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించిన ఇమ్రాన్ అహిందర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడినట్లు వెల్లడైంది. అతడిని TTPతో సంబంధం ఉన్న వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు. పాకిస్థాన్ సైన్యానికి వ్యతిరేకంగా చర్యలకు పాల్పడేందుకు మాలిక్ అతడి సహాయం కోరినట్లు అధికారులు ఆరోపించారు.
ఆఫ్ఘనిస్థాన్ వెళ్లేందుకు పాస్‌పోర్టు, వీసా కోసం ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ చివరకు ప్రయాణించలేదని పోలీసులు తెలిపారు. మాలిక్ మొబైల్ ఫోన్ నుంచి ఆడియో రికార్డింగ్‌లు, చాటింగ్‌లు, ఇతర డిజిటల్ సమాచారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పాకిస్థాన్ సైన్యం ముస్లింలపై అకృత్యాలకు పాల్పడుతోందనే అభిప్రాయాలను మాలిక్ సోషల్ మీడియాలో వ్యక్తం చేసినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. కేసును BNS సెక్షన్ 113(3) కింద నమోదు చేసి, TTPతో అతడికి ఉన్న సంబంధాలు, కుట్రకు సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..