Tirumala Laddu: నేడు సుప్రీంకోర్టులో టీటీడీ లడ్డు కల్తీ వివాదంపై విచారణ

|

Oct 04, 2024 | 10:33 AM

తిరుమల లడ్డూ వ్యవహారం మరింత ముదురుతోంది. అటు ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరడంతో విచారణ ప్రారంభమైంది. నేడు సుప్రీంకోర్టులో ఈ టీటీడీ లడ్డు కల్తీ వివాదంపై విచారణ జరుగనుంది. ఈ లడ్డూపై జస్టిస్..

Tirumala Laddu: నేడు సుప్రీంకోర్టులో టీటీడీ లడ్డు కల్తీ వివాదంపై విచారణ
Follow us on

తిరుమల లడ్డూ వ్యవహారం మరింత ముదురుతోంది. అటు ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరడంతో విచారణ ప్రారంభమైంది. నేడు సుప్రీంకోర్టులో ఈ టీటీడీ లడ్డు కల్తీ వివాదంపై విచారణ జరుగనుంది. ఈ లడ్డూపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, రచయిత సంపత్ విక్రమ్, ఓ టీవీ ఛానల్ ఎడిటర్ సురేష్ ఖండేరావు చౌహాన్కే దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం విచారణ జరుగనుంది.

అయతిఏ సిట్ దర్యాప్తు కొనసాగాలా లేక కేంద్ర దర్యాప్తు సంస్థలకు విచారణ అప్పగించాలా అన్న విషయంపై తన వైఖరి తెలియజేయనుంది కేంద్ర. గురువారం విచారణ సందర్భంగా నేటి వరకు సమయం కోరింది సొలిసిటర్ జనరల్. తన పిటిషన్‌పై పార్టీ-ఇన్-పర్సన్‌గా స్వయంగా వాదనలు వినిపించనున్నారు బీజేపీ నేత సుబ్రహ్మణ్యన్ స్వామి.

కాగా, ఈ లడ్డూకు సంబంధించిన రెండు పిటిషన్లు గురువారం సుప్రీం కోర్టులో దాఖలయ్యాయి. ఈ రెండు నెంబ‌ర్ల‌లో జాబితా అయిన కేసులు గురువారం మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు విచార‌ణ జ‌ర‌గాల్సి ఉండేది. అయితే అదే స‌మయంలో సొలిటర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా వేరే కోర్టులో ఉండ‌టంతో శుక్రవారం మొద‌టి కేసుగా ఈ పిటిష‌న్ల‌ను విచారించాల‌ని ఆయ‌న త‌రపు న్యాయ‌వాదులు అభ్య‌ర్థించారు. అందుకు ధ‌ర్మాసనం అంగీక‌రించి విచారణ‌ను ధ‌ర్మాస‌నం నేడు విచారణ చేపట్టనుంది.


మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి