లక్షల్లో మొక్కలు నాటి.. పద్మశ్రీ అవార్డు అందుకున్న పెద్దావిడ ఇక లేరు..

|

Dec 18, 2024 | 9:41 AM

Tulsi Gowda: వృక్ష ప్రేమిగా పేరుగాంచిన తులసిగౌడ (87)  మంగళవారం కన్నుమూశారు. చిన్న వయసులోనే పర్యావరణం పట్ల ఎంతో శ్రద్ధ కనబరిచిన తులసిగౌడకు చెట్లను నాటి వాటిని పెంచి పోషించి పర్యావరణ ప్రేమికురాలిగా పేరు సంపాదించుకుంది. పర్యావరణంపై ఆమెకున్న ప్రేమకు మెచ్చి కేంద్ర ప్రభుత్వం 'పద్మశ్రీ' పురస్కారంతో సత్కరించింది

లక్షల్లో మొక్కలు నాటి.. పద్మశ్రీ అవార్డు అందుకున్న పెద్దావిడ ఇక లేరు..
Tribal Environmental Activist Tulasi Gowda Passes Away
Follow us on

వృక్ష ప్రేమిగా పేరుగాంచిన కర్ణాటకకి చెందిన తులసిగౌడ (87)  మంగళవారం కన్నుమూశారు. ఈమె అంకోలా తాలూకాలోని హొన్నల్లి గ్రామాంలో జన్మించింది. చిన్న వయసులోనే పర్యావరణం పట్ల ఎంతో శ్రద్ధ కనబరిచిన తులసిగౌడ‌కు చెట్లను నాటి వాటిని పెంచి పోషించి పర్యావరణ ప్రేమికురాలిగా పేరు సంపాదించుకుంది.  ఆమె సేవలను గుర్తించిన ప్రభుత్వం 2020లో పద్మశ్రీ అవార్డును అందజేసింది.

నిరుపేద కుటుంబంలో పుట్టిన తులసి గౌడ కలప సేకరించి అమ్ముతూ జీవనం సాగించేవాడు. అలాగే మట్టిఘట్ట ఫారెస్ట్ నర్సరీలో పనిచేసి పదవీ విరమణ చేసినా చినిపోయేవారకు అక్కడికి వెళ్లి శిక్షణ ఇచ్చి యువతకు మార్గనిర్దేశం చేసింది. తులసిగౌడ్ గత ఆరు దశాబ్దాలుగా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఈ పని చేసింది.

అటవీశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వనవాసం కార్యక్రమంలో తులసి చురుగ్గా పాల్గొనేదని స్థానికులు చెబుతున్నారు. ఆమె ఈ సేవకు గుర్తింపుగా అటవీశాఖలో దినసరి కూలీగా పని చేస్తున్న ఆమెను  పర్మినెంట్ చేశారు. 14 సంవత్సరాల తరువాత ఆమె సర్వీస్ నుండి రిటైర్ అయింది. తులసి పేదరికంలో ఉన్న హలక్కీ గిరిజన కుటుంబంలో జన్మించింది. ఆమెకు రెండేళ్ల వయసున్నప్పుడే తండ్రి చనిపోయాడు. తర్వాత చదువుకు దూరమైన తులసిగౌడ తన తల్లితో కలిసి కార్మిక బాట పట్టింది. తులసి చిన్న వయసులోనే గోవింద గౌడను పెళ్లాడింది. కానీ అతను కూడా కొన్నేళ్లకే చనిపోయాడు. అయితే ఇన్ని షాక్‌లను ఎదుర్కొన్న తులసి గౌడ నేడు యావత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. పర్యావరణంపై ఆమెకున్న ప్రేమకు మెచ్చి రాజ్యోత్సవ అవార్డు వరించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ‘ప్రియదర్శిని వృక్షమిత్ర అవార్డు’తో సత్కరించారు. భారత ప్రభుత్వం అందించే ‘పద్మశ్రీ’ పురస్కారం కూడా అందుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి