అయ్యో దేవుడా.. పుట్టింట్లో భార్య.. లాడ్జిలో భర్త.. ఆత్మహత్యల వెనక అసలు కారణం ఏంటంటే..?

వందల మంది సాక్షిగా, కోట్ల ఖర్చుతో వైభవంగా పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ సంతోషం వారం కూడా నిలవలేదు. పది రోజుల పర్యటన కోసం శ్రీలంక వెళ్లిన ఆ జంట, కేవలం నాలుగు రోజులకే ఎందుకు వెనక్కి వచ్చారు? పచ్చని పందిరి కింద ఒక్కటైన ఆ దంపతుల మధ్య చేరిన ఆ అనుమానం అనే పెనుభూతం ముగ్గురి ప్రాణాలను ఎలా బలి తీసుకుంది.. విలాసవంతమైన పెళ్లి వెనుక దాగున్న భయంకరమైన నిజం ఏమిటి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

అయ్యో దేవుడా.. పుట్టింట్లో భార్య.. లాడ్జిలో భర్త.. ఆత్మహత్యల వెనక అసలు కారణం ఏంటంటే..?
New Married Couple End Lives

Updated on: Dec 28, 2025 | 10:46 AM

శ్రీలంకలో సంతోషంగా గడపాల్సిన హనీమూన్ పర్యటన, చివరకు రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపిన తీరు అత్యంత బాధాకరం. అనుమానం, అవగాహన లోపం వెరసి ఇద్దరు నూతన వధూవరుల ప్రాణాలను బలిగొన్నాయి. అత్యంత వైభవంగా జరిగిన పెళ్లి.. వారం తిరగకముందే విచ్ఛిన్నమైంది. అనుమానం అనే అగాధం భార్యభర్తల ప్రాణాలను తీయడమే కాకుండా ఒక తల్లిని మృత్యువు అంచుల్లోకి నెట్టేసింది. అక్టోబరు 29న బెంగళూరు ప్యాలెస్‌ మైదానంలో గానవి, సూరజ్‌లకు అత్యంత విలాసవంతంగా వివాహం జరిగింది. అయితే పెళ్లైన మొదటి రోజు నుంచే వీరిద్దరి మధ్య సఖ్యత లోపించింది. గానవికి మరొకరితో ఉన్న స్నేహాన్ని సూరజ్‌ అనుమానించగా సూరజ్ వైవాహిక జీవితానికి పనికిరాడని గానవి తన బంధువుల వద్ద వాపోయింది.

చివరకు కుటుంబ సభ్యులు దంపతుల మధ్య రాజీ కుదిర్చి వారిని శ్రీలంకకు పది రోజుల హనీమూన్ పర్యటనకు పంపారు. కానీ అక్కడ కూడా గొడవలు ముదరడంతో పది రోజుల పర్యటనను కేవలం నాలుగు రోజులకే ముగించుకుని తిరిగి బెంగళూరు చేరుకున్నారు. హనీమూన్ నుంచి తిరిగి వచ్చిన గానవి, రామమూర్తినగరలోని తన పుట్టింటికి వెళ్లింది. మనస్తాపంతో బుధవారం విషం తాగిన ఆమె చికిత్స పొందుతూ గురువారం రాత్రి ప్రాణాలు విడిచింది.

భార్య మరణవార్త తెలిసిన సూరజ్.. పోలీసు కేసులకు భయపడి తన తల్లి జయంతి, సోదరుడు సంజయ్‌తో కలిసి మహారాష్ట్రలోని నాగపూర్‌కు పరారయ్యాడు. అక్కడ ఒక లాడ్జ్‌లో గది తీసుకుని శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడి ఆత్మహత్యతో కుంగిపోయిన తల్లి జయంతి కూడా విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం ఆమె నాగపూర్‌లోని ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. ఆడంబరంగా పెళ్లి చేసినా, మనసులు కలవని చోట బంధం నిలవదని ఈ ఘటన నిరూపించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..