West Bengal: ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మరో షాక్‌.. బీజేపీలో చేరిన మరో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

|

Jan 20, 2021 | 7:09 PM

West Bengal: పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బెంగాల్‌ రాజకీయం వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి భారీ..

West Bengal: ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మరో షాక్‌.. బీజేపీలో చేరిన మరో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే
Follow us on

West Bengal: పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బెంగాల్‌ రాజకీయం వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి భారీ షాక్‌ తగిలింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు పార్టీని వీడుతున్నారు. తాజాగా మరో ఎమ్మెల్యే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. శాంతిపూర్‌ ఎమ్మెల్యే అరిందమ్ ‌ భట్టాచార్య బుధవారం బీజేపీలో చేరారు. న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ పశ్చిమబెంగాల్‌ ఇన్‌చార్జి కైలాస్‌ విజయవర్గీయ సమక్షంలో ఆయన కాషాయం కండువా కప్పుకొన్నారు. అనంతరం భట్టాచార్య మీడియాతో మాట్లాడుతూ.. తనలాంటి యువనేతలను తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకత్వం ఎదగనీయడం లేదని విమర్శించారు.

ఎన్నో ఆశలతో టీఎంసీలో చేరి నా ప్రాంతంలో ఎన్నో సేవలు చేయాలని అనుకున్నా.. ఎదగనీయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తమ ప్రాంతాలను అభివృద్ధి చేయగలిగే సమర్ధ నాయకులున్నా.. వారిని పార్టీ ఉపయోగించుకోవడం లేదు అని అన్నారు. పశ్చిమబెంగాల్‌ ప్రజలు మోదీకి, బీజేపీకి పూర్తి మద్దతు ఇవ్వాలని భట్టాచార్య కోరారు.

కాగా, బెంగాల్‌లో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బీజేపీ నేతలు దూకుడు పెంచారు. ఎలాగైనా ఎన్నికల్లో విజయం సాధించాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటి నుంచి బీజేపీ నేతలు బెంగాల్‌లో పర్యటనలు ముమ్మరం చేశారు. ఢిల్లీ బీజేపీ పెద్దల ఆదేశంతో పలువురు బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు బెంగాల్‌లో మకాం వేసి ఇప్పటి నుంచే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

Also Read: ఆలయాల విధ్వంసం వెనుక టీడీపీ కుట్రే.. సంతబొమ్మాళిలో ఆయన మనుషులు అడ్డంగా దొరికారన్న మంత్రి