మందుబాబుల కళ్లల్లో ఆనందబాష్పాలు! ఈ రెస్టారెంట్‌లో రూ.44లకే కింగ్‌ఫిషర్‌.. విస్కీ, బీర్‌ ధరలు కూడా అంతంతమాత్రమే..

|

Feb 06, 2023 | 11:25 AM

సాధారణంగా ఎప్పుడైనా రెస్టారెంట్‌కు వెళ్తే మనకు తెలియకుండానే మనకళ్లు మెనూలోని ధరవైపు చకచక పరుగులు తీస్తాయి. అలా వెతికివెతికి మన బడ్జెట్‌కు సరిపోయే ఐటెంను సెలెక్ట్‌ చేసుకోవడం పరిపాటి. డ్రిక్స్‌, ఫుడ్‌, స్నాక్స్‌..

మందుబాబుల కళ్లల్లో ఆనందబాష్పాలు! ఈ రెస్టారెంట్‌లో రూ.44లకే కింగ్‌ఫిషర్‌.. విస్కీ, బీర్‌ ధరలు కూడా అంతంతమాత్రమే..
Alcoholic Drinks
Follow us on

సాధారణంగా ఎప్పుడైనా రెస్టారెంట్‌కు వెళ్తే మనకు తెలియకుండానే మనకళ్లు మెనూలోని ధరవైపు చకచక పరుగులు తీస్తాయి. అలా వెతికివెతికి మన బడ్జెట్‌కు సరిపోయే ఐటెంను సెలెక్ట్‌ చేసుకోవడం పరిపాటి. డ్రిక్స్‌, ఫుడ్‌, స్నాక్స్‌.. ఏదైనా సరే.. విలాసవంతమైన రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు సగటు కామన్‌ మ్యాన్‌ ఆలోచన ఎప్పుడూ ఇలానే ఉంటుంది. ఐతే ఇండియన్‌ నేవీ అధికారుల మెస్‌లోని మెనూ బిల్లు చూస్తే మాత్రం కళ్ల వెంట నీళ్లు టపటప రాలుతాయి. ఎందుకంటే బయట మార్కెట్లో వందల వేలకు దొరికే డ్రింక్స్‌, స్నాక్స్‌ అక్కడ అతి తక్కువ ధరకే దొరుకుతున్నాయట. అందుకు సంబంధించిన బిల్లు ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. మీరు ఓ లుక్కేసుకోండి..

అనంత్ అనే ట్విట్టర్ యూజర్‌ నేవీ ఆఫీసర్స్ మెస్‌ ఛార్జీల బిల్లును ట్వీట్‌ చేశాడు. నా బెంగుళూరు బ్రెయిన్‌ ఈ ధరలను అర్ధం చేసుకోలేకపోతుందనే క్యాప్షన్‌ కూడా తన పోస్టుకు జోడించాడు. ఈ బిల్లులో విస్కీ, బీర్ వంటి పలు బ్రాండ్‌లకు సంబంధించిన ఖరీదైన డ్రింక్స్‌ కేవలం బడ్జెట్ ధరకే విక్రయించినట్లు చూపుతోంది. నిజానికి.. ఆర్మీ సిబ్బంది కేంద్ర ప్రభుత్వ అధికారులు కాబట్టి వారికి సెంట్రల్ ఎక్సైజ్ సుంకం నుంచి మినహాయింపు ఉంటుంది. అందువల్లనే మిలటరీ క్యాంటీన్లలో మద్యం, పలు రకాల కిరాణా వస్తువులు బయటి మార్కెట్ల కంటే కేవలం 10 నుంచి 15 శాతం చౌకగా లభిస్తాయి. ఈ విషయం తెలియని నెటిజన్లు కామెంట్‌ సెక్షన్‌లో భిన్న కామెంట్లు చేస్తున్నారు. ‘ఈ ధరలు ఎక్కడ.. ఎప్పుడు చూశావ్‌ బ్రో..?’ ఒకరు, ‘హహహ.. ఇది DSOI మెనూలా ఉంది. లవ్‌ ఇట్‌! బెంగళూరులో కింగ్‌ ఫిషర్‌ రూ.500లకు కొన్నాను’ అని మరొకరు, ముంబైలోని ఓ బార్ అండ్‌ రెస్టారెంట్‌కి వెళ్లి అక్కడి ధరలు చూసి షాక్‌ అయ్యాను. 60MLకు నమ్మశక్యం కాని రేట్లు చెప్పారు. ఈ రెస్టారెంట్‌ ఎక్కడుంది.. అని వాకబు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.