Lok Sabha Elections 2024: కాంగ్రెస్ చరిత్రలోనే తొలిసారిగా అతి తక్కువ సీట్లలో పోటీ.. కారణం ఏంటంటే?

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సుదీర్ఘకాలం దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా చరిత్రలోనే అతి తక్కువ స్థానాల్లో పోటీ చేస్తోంది. వందేళ్లకు పైగా చరిత్ర కల్గిన ఆ రాజకీయ పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో 543 స్థానాల లోక్‌సభలో కేవలం 328 సీట్లలో మాత్రమే పోటీకి పరిమితమైంది. దేశంలో ఆ పార్టీ ప్రాభవం కోల్పోతుంది అని చెప్పేందుకు ఇంతకు మించిన సంకేతం ఇంకేమీ ఉండదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సంకీర్ణాల యుగంలోనూ కాంగ్రెస్ పార్టీ 400 సీట్లకు తగ్గకుండా పోటీ చేస్తూ వచ్చింది.

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ చరిత్రలోనే తొలిసారిగా అతి తక్కువ సీట్లలో పోటీ.. కారణం ఏంటంటే?
Congress Party
Follow us

| Edited By: Srikar T

Updated on: May 09, 2024 | 11:20 AM

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సుదీర్ఘకాలం దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా చరిత్రలోనే అతి తక్కువ స్థానాల్లో పోటీ చేస్తోంది. వందేళ్లకు పైగా చరిత్ర కల్గిన ఆ రాజకీయ పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో 543 స్థానాల లోక్‌సభలో కేవలం 328 సీట్లలో మాత్రమే పోటీకి పరిమితమైంది. దేశంలో ఆ పార్టీ ప్రాభవం కోల్పోతుంది అని చెప్పేందుకు ఇంతకు మించిన సంకేతం ఇంకేమీ ఉండదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సంకీర్ణాల యుగంలోనూ కాంగ్రెస్ పార్టీ 400 సీట్లకు తగ్గకుండా పోటీ చేస్తూ వచ్చింది. గత (2019) సార్వత్రిక ఎన్నికల్లో 421 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్, 2014లో 464, 2009లో 440 సీట్లలో పోటీ చేసింది. 1989 – 1999 మధ్యకాలంలోనూ కాంగ్రెస్ పార్టీ 450 సీట్లకు పైగా స్థానాల్లో పోటీ చేసింది. కానీ ఈసారి ఇంత అత్యల్ప సంఖ్యలో పోటీ చేయడానికి కారణం పెద్ద రాష్ట్రాల్లో మిత్రపక్షాలకు పెద్దన్న హోదా ఇవ్వడమేనని స్పష్టమవుతోంది. ఉత్తర్ ప్రదేశ్ (80), పశ్చిమ బెంగాల్ (42), బిహార్ (40), తమిళనాడు (39) రాష్ట్రాల్లో మొత్తం 201 లోక్‌సభ స్థానాలుండగా.. ఆయా రాష్ట్రాల్లో విపక్ష కూటమిలో ఉన్న స్థానిక ప్రాంతీయ పార్టీలే అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ (BJP)ని గద్దె దించడమే లక్ష్యంగా ప్రాంతీయ పార్టీలకు సింహభాగం త్యాగం చేసిన కాంగ్రెస్ పార్టీ తనకు తాను 328 స్థానాలకు పరిమితం చేసుకుంది. దేశవ్యాప్తంగా 400కు పైగా స్థానాల్లో పోటీ చేసినప్పుడే మెజారిటీ మార్కు చేరుకోలేకపోయిన కాంగ్రెస్, ఇప్పుడు తాను పోటీ చేస్తున్న స్థానాలనే ఇంతగా కుదించుకున్న తర్వాత గెలిచేది ఎన్ని అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.

మెజారిటీ మార్కుకు దూరంగా..

ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తప్ప, ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే మెజారిటీ సీట్లు సాధించలేకపోయింది. రాజీవ్ గాంధీ హత్యానంతరం మూడు పర్యాయాలు కాంగ్రెస్ అధికార పీఠాన్ని చేపట్టినప్పటికీ.. ఏదీ కూడా సొంత మెజారిటీతో ఏర్పడ్డ ప్రభుత్వం కాదు. 1984 సార్వత్రిక ఎన్నికల్లో 414 సీట్లతో అద్వితీయ విజయాన్ని అందుకున్న కాంగ్రెస్, 1989లో రాజీవ్ గాంధీ నేతృత్వంలో 197 సీట్లకు పరిమితమైంది. 1991లో 244 సీట్లతో పీవీ నరసింహారావు మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదేళ్లపాటు నడిపారు. 1996లో 140, 1998లో 141, 1999లో 114, 2004లో 145, 2009లో 206 సీట్లు సాధించిన కాంగ్రెస్.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 272 మార్కును 1984 తర్వాత ఏ ఎన్నికల్లోనూ అందుకోలేకపోయింది. 2004-2014 మధ్యకాలంలో పదేళ్లపాటు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిన కాంగ్రెస్, 2014 ఎన్నికల్లో 44 సీట్లకు, 2019 ఎన్నికల్లో 52 సీట్లకు పరిమితమైంది. అంటే గత 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ మేజిక్ ఫిగర్‌ను చేరుకోలేకపోగా, భారతీయ జనతా పార్టీ (BJP) 4 దశాబ్దాల క్రితం 2 సీట్లతో తన ప్రస్థానాన్ని ప్రారంభించి 2019 నాటికి సొంతంగా 303 సీట్లు సాధించే స్థాయికి ఎదిగింది.

వ్యూహాత్మక వెనుకడుగు?

సాధారణంగా ఏ రాజకీయ పార్టీ కూడా తక్కువ స్థానాలకే పరిమితమై పోటీ చేయాలని కోరుకోదు. ఒకవేళ ఎవరైనా అలా చేశారంటే.. కచ్చితంగా దాని వెనుక ఒక వ్యూహం దాగుంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాత్మకంగా వెనుకడుగు వేసినట్టు ఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. దేశవ్యాప్తంగా 543 స్థానాల్లో సుమారుగా 200 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో నేరుగా తలపడుతోంది. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట బీజేపీ విజయావకాశాలు అంత ఎక్కువగా లేవు. ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీతో ముఖాముఖి పోరు ఉంటుందో అక్కడ బీజేపీ విజయావకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ పరిస్థితులను బేరీజు వేసుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఎలాగైనా సరే నరేంద్ర మోదీని గద్దె దించాలని కంకణం కట్టుకుంది. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు సింహభాగం సీట్లలో పోటీ చేసేలా పొత్తులు కుదుర్చుకుంది. మరోమాటలో చెప్పాలంటే అంతకు మించి కాంగ్రెస్ ముందు మరో ప్రత్యామ్నాయం కూడా లేదు. ఒకవేళ సీట్ల విషయంలో పంతానికి పోయి ఎవరికివారుగా పోటీ చేస్తే… మిత్రపక్షాల మధ్య చీలే ప్రతీ ఓటు బీజేపీ విజయానికి దోహదం చేస్తుంది. అందుకే తమకు ఇష్టం లేకున్నా సరే.. చరిత్రలోనే అతి తక్కువ స్థానాలకు పరిమితమై పోటీ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

ఉదాహరణకు ఉత్తర్‌ప్రదేశ్ విషయానికొస్తే.. ఈ రాష్ట్రంలో మొత్తం 80 పార్లమెంట్ స్థానాలుండగా.. 2019లో 67 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసింది. వాటిలో 63 చోట్ల డిపాజిట్లు కోల్పోగా.. కేవలం సోనియా గాంధీ మాత్రమే గెలుపొందారు. నాడు ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీకి తన సొంత నియోజకవర్గం అమేఠీలో ఘోర పరాభవం ఎదురైంది. అందుకే ఈ సారి మిత్రపక్షం సమాజ్‌వాదీకి 63 స్థానాల్లో పోటీ చేసే అవకాశమిచ్చి, కాంగ్రెస్ కేవలం 17 సీట్లకే పరిమితమైంది. గత ఎన్నికలతో పోల్చితే ఈ ఒక్క రాష్ట్రంలోనే 50 సీట్లు తగ్గాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 2019లో 41 సీట్లలో పోటీ చేయగా, ఈ సారి కేవలం 12 స్థానాల్లో మాత్రమే పోటీలో ఉంది. మహారాష్ట్రలో గతంలో 25 స్థానాల్లో పోటీ చేయగా, ఈసారి 17కు పరిమితమైంది. దేశ రాజధాని ఢిల్లీలో సైతం 4 స్థానాలు వదులుకుని, 3 స్థానాలకే పరిమితమైంది. కేవలం కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో మాత్రమే గతం కంటే కాస్త ఎక్కువ సీట్లలో పోటీ చేస్తోంది.

నేతల వలసలు కూడా కారణమే..

కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా పలువురు సీనియర్ నేతలు పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి వలస పోయారు. వారిలో ఎక్కువ మంది రాజకీయ ప్రత్యర్థి బీజేపీలో చేరారు. కొన్ని తరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం జీవితాలను ధారపోసిన కుటుంబాలకు చెందిన నేతలు సైతం కాంగ్రెస్ భవిష్యత్తు లేదని గ్రహించి పార్టీకి గుడ్ బై చెప్పారు. ముఖ్యంగా నాయకత్వ లేమి ఆ పార్టీని వేధిస్తోంది. కొత్త తరానికి, యువ నాయకత్వానికి ప్రాధాన్యత ఇస్తామంటూ కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాల్లో తీర్మానాలు చేయడమే తప్ప.. ఆచరణలో ఏమాత్రం అమలు చేయడం లేదు. ఏఐసీసీ అధ్యక్ష పదవికి కురువృద్ధుడు మల్లికార్జున ఖర్గేను ఎంపిక చేయడమే ఆ పార్టీ హామీలకు, ఆచరణకు మధ్య వ్యత్యాసాన్ని బట్టబయలు చేస్తోంది.

నేతల వలసలతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దూరమవడం వెనుక మరో కారణంగా ఆ పార్టీ నాయకత్వానికి ప్రజలు ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తుకురావడమేనని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. వీరికి భిన్నంగా బీజేపీ నేతలు ఓడిపోయినా సరే నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు వీలైనంతమేర ప్రజలతో మమేకమవుతున్నారు. కాంగ్రెస్ నేతలు మాత్రం ఎన్నికల సమయంలో హడావుడి చేస్తూ యాత్రలు, సభలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి స్వయంకృతాపరాధాలు ప్రత్యర్థులకు వరాలుగా మారుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
క్యాన్సర్ భూతాన్ని పారదోలే అద్భుత ఫలం..
క్యాన్సర్ భూతాన్ని పారదోలే అద్భుత ఫలం..
తిరుపతి గంగమ్మ జాతరలో తుది ఘట్టం అదే.. వేల సంఖ్యలో భక్తులు..
తిరుపతి గంగమ్మ జాతరలో తుది ఘట్టం అదే.. వేల సంఖ్యలో భక్తులు..
ట్విస్టులే ట్విస్టులు.. కావ్య షాక్.. టెన్షన్‌లో సుభాష్, రాజ్!
ట్విస్టులే ట్విస్టులు.. కావ్య షాక్.. టెన్షన్‌లో సుభాష్, రాజ్!
వార్మప్ మ్యాచ్ నుంచి తప్పుకున్న కోహ్లీ, సిరాజ్, శాంసన్.. ఎందుకంటే
వార్మప్ మ్యాచ్ నుంచి తప్పుకున్న కోహ్లీ, సిరాజ్, శాంసన్.. ఎందుకంటే
అధిక రక్తపోటు ఎంత ప్రమాదమో తెలుసా? నిర్లక్ష్యం చేశారో ఇక అంతే..
అధిక రక్తపోటు ఎంత ప్రమాదమో తెలుసా? నిర్లక్ష్యం చేశారో ఇక అంతే..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
ఇరాన్‌ అధ్యక్షుడు ప్రయాణించిన బెల్‌-212 ఏ దేశం తయారు చేసిందంటే?
ఇరాన్‌ అధ్యక్షుడు ప్రయాణించిన బెల్‌-212 ఏ దేశం తయారు చేసిందంటే?
మళ్లీ మొదలు.. ఎందుకిలా.? కల్కిపై ప్రభాస్ ఫ్యాన్స్ గుస్సా.!
మళ్లీ మొదలు.. ఎందుకిలా.? కల్కిపై ప్రభాస్ ఫ్యాన్స్ గుస్సా.!
ఖాళీ కడుపుతో డ్రై ఫ్రూట్స్ తింటున్నారా.. ఏమవుతుందో తెలుసా.?
ఖాళీ కడుపుతో డ్రై ఫ్రూట్స్ తింటున్నారా.. ఏమవుతుందో తెలుసా.?
చిన్నప్పుడే నా ఫోటోలు అలాంటి సైట్స్‌లో పెట్టారు
చిన్నప్పుడే నా ఫోటోలు అలాంటి సైట్స్‌లో పెట్టారు
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!