అర్జునుడు బృహనాలగా మారడానికి ఆమె శాపమే కారణమా.?

TV9 Telugu

20 May 2024

మహాభారత సమయంలో జూదంలో కౌరవులతో ఓడిన పాండవులు అరణ్యవసంతో పాటు ఒక్క సంవత్సరం అజ్ఞాతవాసం కూడా చేయాల్సి వచ్చింది.

అరణ్యవాసం పూర్తిచేసుకొని అజ్ఞాతవాసం కోసం మశ్చి రాజ్యంలో విరాట్టును కొలువులో ద్రౌపది, పాండవులు గడిపారు.

ధర్మరాజు కంకుభట్టుగా, అర్జునుడు బృహనాలగా, భీముడు వలలుడుగా, నకులుడు దామగ్రంథిగా, సహదేవుడు తంత్రీపాలుడుగా, ద్రౌపది మాలినిగా విరాట కొలువులో చేరారు.

అయితే అర్జునుడు బృహనాలగా ఇక్కడ చేరడానికి మరో కారణం కూడా ఉందని మీకు తెలుసా.? దీనికి కారణం ఊర్వశి శాపం.

అర్జునుడు కొన్నాళ్ల స్వర్గంలో ఉన్నప్పుడు అక్కడ సంగీత, నృత్య శాస్త్రములను అంతఃపురంలోని కన్యలకు నేర్పించేవాడు.

ఆ సమయంలో అర్జునుడిపై మనుసు పడ్డ ఊర్వశి తనను వివాహం చేసుకోమని అడిగితే.. ఆమె ప్రతిపాదన అతను తిరస్కరించాడు.

దీంతో ఆగ్రహానికి గురైన ఊర్వశి నపుంసకునిగా మారుగాక అని శపించింది. ఇంద్రుడి కోరిక మేరకు దాన్ని సంవత్సరానికి సవరించింది.

కాబట్టి ఊర్వశి ఇచ్చిన ఆ శాపాన్ని విరాటుడి రాజభవనంలో ఒక సంవత్సరం పాటు బృహనాలగా అనుభవించాడు అర్జునుడు.