Swarn Prasadam: ఈ దీపావళికి దేశంలో అత్యంత ఖరీదైన స్వీట్ ఇదే.. దీని ప్రత్యేక ఏంటో తెలుసా?

Swarn Prasadam: దీపావళి అంటే మొటగా గుర్తొచ్చేది టపాసులు, ఆ తర్వాత స్వీట్లు. ఈ పండగకు స్వీట్లకు ఓ ప్రత్యేక ఉంటుంది. దివాళి వచ్చిందంటే చాలా ప్రతి ఒక్కరూ స్వీట్స్ షాప్స్‌ ముందు క్యూ కడుతారు. కస్టమర్లను ఆకర్షించేందుకు వ్యాపారులు కూడా రకరకాల స్వీట్లను తయారు చేస్తారు. ఇలానే ఈ దివాళి జైపూర్‌లో ఓ వ్యాపారి ప్రత్యేక గోల్డ్‌ స్వీట్‌ను తయారు చేశాడు. ఈ స్వీట్‌ ధర తెలిస్తే మీరు కచ్చితంగా షాక్‌ అవుతారు.

Swarn Prasadam: ఈ దీపావళికి దేశంలో అత్యంత ఖరీదైన స్వీట్ ఇదే.. దీని ప్రత్యేక ఏంటో తెలుసా?
Swarn Prasadam

Updated on: Oct 18, 2025 | 6:35 PM

దీపావళి అంటే మొటగా గుర్తొచ్చేది టపాసులు, ఆ తర్వాత స్వీట్లు. ఈ పండగకు స్వీట్లకు ఓ ప్రత్యేక ఉంటుంది. దివాళి వచ్చిందంటే చాలా ప్రతి ఒక్కరూ స్వీట్స్ షాప్స్‌ ముందు క్యూ కడుతారు. కస్టమర్లను ఆకర్షించేందుకు వ్యాపారులు కూడా రకరకాల స్వీట్లను తయారు చేస్తారు. ఇలానే రాజస్థాన్‌కు చెందిన ఒక వ్యాపారి కూడా అందరికీ బిన్నంగా ఈ దివాళి దేశంలోనే ఖరీదైన సరికొత్త గొల్డ్‌ స్వీట్‌ను తయారు చేశాడు. బంగారు పూతను ఉపయోగించి తయారు చేసిన ఈ స్వీట్‌ను ‘స్వర్ణ భస్మ’’ లేదా స్వర్ణ ప్రసాదం పేరుతో విక్రయిస్తున్నాడు. పేరుకు తగట్టుగానే ఈ స్వీట్‌కు ధరను నిర్ణయించాడు ఆ వ్యాపారి. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ స్వర్ణ ప్రసాదం ధర లక్షరాల రూ.లక్షా పదకొండు వేలు పలుకుతుంది.

ఈ స్వీటు ఎందుకు అంత స్పెషల్

ఈ స్వర్ణ ప్రసాదం స్వీట్‌కు అంద ధర ఎందుకు పెట్టారంటే. ఆ వ్యాపారిలో దాని తయారీలో 24 క్యారెట్ల బంగారంతో పాటు కుంకుమ పువ్వు, బాదం, ఆయుర్వేద పదార్థాలను ఉపయోగించాడు. అలాగే ఈ స్వీట్స్‌లో ఆరోగ్యాన్ని మిళితం చేసే పదార్థాలే ఉంటాయి. అందుకే ఇప్పుడు ఇది దీంతో దేశంలోనే అత్యంత ఖరీదైన స్వీట్స్‌గా పిలువబడుతుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ స్వీట్స్ కిలో రూ.1.11 లక్షల ధర పలుకుతుంది.

స్వర్ణ ప్రసాదం అమ్మే స్వీట్ అవుట్‌లెట్ యజమాని అంజలి జైన్ మాట్లాడుతూ, నేడు, ఈ స్వీట్ భారతదేశంలో అత్యంత ఖరీదైన స్వీట్ అని.. దీని ధర రూ. 1,11,000 అని చెప్పు కొచ్చింది. దీని ప్యాకేజింగ్ కూడా చాలా ప్రీమియంగా ఉంటుందని. దీనిని ఒక ఆభరణాల పెట్టెలో ప్యాక్ చేసి ఇస్తామని తెలిపింది. దీనిలో వాడిన బంగారాన్ని వారు జైన దేవాలయం నుండి కొనుగోలు చేసినట్టు ఆమె తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.