AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బుమ్రా వేసిన నోబాలే కొంప ముంచిందన్న భువీ

క్రికెట్‌ ఆటే అనూహ్యం.. ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు.. ఒక్క బంతి ఆట స్వరూపాన్నే మార్చేస్తుంది

బుమ్రా వేసిన నోబాలే కొంప ముంచిందన్న భువీ
Balu
| Edited By: |

Updated on: Jun 29, 2020 | 1:59 PM

Share

క్రికెట్‌ ఆటే అనూహ్యం.. ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు.. ఒక్క బంతి ఆట స్వరూపాన్నే మార్చేస్తుంది.. మూడేళ్ల కిందట పాకిస్తాన్‌తో జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లోనూ ఇదే జరిగింది. ఆ మ్యాచ్‌ను రివైండ్‌ చేసుకున్న టీమిండియా మీడియం పేస్‌ బౌలర్‌ భువనేశ్వర్‌కుమార్‌ ఇదే విషయాన్ని చెప్పుకొచ్చాడు..

జస్‌ప్రీత్‌ బుమ్రా వేసిన నోబాల్‌ మ్యాచ్‌ను పాకిస్తాన్‌ పరం చేసిందన్నాడు భువనేశ్వర్‌కుమార్‌. బుమ్రా వేసిన బాల్‌ను ఆడేందుకు తడబడిన ఓపెనర్‌ ఫకార్‌ జమాన్ కీపర్‌ ధోనికి క్యాచ్‌ ఇచ్చాడు.. కాకపోతే అది నోబాల్‌ కావడంతో ఫకార్‌ జమాన్‌ బతికిపోయాడు.. ఆ తర్వాత మళ్లీ ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఫకార్‌ 114 పరుగులు చేశాడు.. ఫలితంగా పాకిస్తాన్‌ 338 పరుగుల భారీ స్కోరు చేయగలింది.. ఆ తర్వాత బ్యాటింగ్‌ చేసిన తాము మాత్రం బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమయ్యామని చెప్పాడు భువనేశ్వర్‌కుమార్‌. తాము 158 పరుగులకే చాపచుట్టేసి 180 పరుగుల తేడాతో ఓటమి చెందామని భువీ చెప్పుకొచ్చాడు.. అది నోబాల్‌ కాకపోయి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు.

ఆ మ్యాచ్‌ను తీసేస్తే ఓవరాల్‌గా టీమిండియా పర్‌ఫార్మెన్స్‌ గత కొన్నేళ్లుగా అద్భుతంగా ఉందన్నాడు భువీ. 2013లో ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిన తర్వాత మూడు నాలుగు ఐసీసీ టోర్నమెంట్లు జరిగాయని… అందులో మూడు సార్లు సెమీఫైనల్‌కు చేరామని, ఓసారి ఫైనల్లో అడుగుపెట్టామని భువీ వివరించాడు. నిరుడు జరిగిన ప్రపంచకప్‌లో కూడా తమను దురదృష్టం వెంటాడిందని, టాపార్డర్‌ విఫలం కావడం వల్లనే న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో ఓటమిపాలయ్యామని భువనేశ్వర్‌కుమార్‌ తెలిపాడు.

Follow Us
భర్తనే లేకపోతే ప్రియుడితో హ్యాపీగా ఉండొచ్చు అనుకుంది..
భర్తనే లేకపోతే ప్రియుడితో హ్యాపీగా ఉండొచ్చు అనుకుంది..
విండీస్‌తో వన్డే సిరీస్.. ముగ్గురు ఐపీఎల్ కెప్టెన్‌లు రీఎంట్రీ?
విండీస్‌తో వన్డే సిరీస్.. ముగ్గురు ఐపీఎల్ కెప్టెన్‌లు రీఎంట్రీ?
అయ్యో డిస్కోశాంతికి ఏమైంది? ఆస్పత్రిలో శ్రీహరి భార్య.. ఫొటో వైరల్
అయ్యో డిస్కోశాంతికి ఏమైంది? ఆస్పత్రిలో శ్రీహరి భార్య.. ఫొటో వైరల్
విమానంలో ఇంటి భోజనం.. జంటను చూసి అంతా షాక్!
విమానంలో ఇంటి భోజనం.. జంటను చూసి అంతా షాక్!
మీ క్రెడిట్‌ కార్డు పేమెంట్‌ వెనుక ఇంత తతంగం ఉందా? ఎవరికి ఎంత?
మీ క్రెడిట్‌ కార్డు పేమెంట్‌ వెనుక ఇంత తతంగం ఉందా? ఎవరికి ఎంత?
కాళ్లలో ఉన్నట్టుండి నొప్పిగా ఉంటోందా?.. అసలు సమస్య ఇదే!
కాళ్లలో ఉన్నట్టుండి నొప్పిగా ఉంటోందా?.. అసలు సమస్య ఇదే!
నీళ్లు తాగినా దాహం తీరడం లేదా?.. దీన్ని అస్సలు లైట్ తీసుకోవద్దు!
నీళ్లు తాగినా దాహం తీరడం లేదా?.. దీన్ని అస్సలు లైట్ తీసుకోవద్దు!
6 నెలల్లో 20 కిలోలు తగ్గిన మహిళ.. ఆమె డైలీ రొటీన్ ఇదే!
6 నెలల్లో 20 కిలోలు తగ్గిన మహిళ.. ఆమె డైలీ రొటీన్ ఇదే!
0, 0, 0, 0, 0, 0.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బుమ్రా
0, 0, 0, 0, 0, 0.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బుమ్రా
వందల ఆరోగ్య ప్రయోజనాలున్న పొన్నగంటి కూర రోటి పచ్చడి
వందల ఆరోగ్య ప్రయోజనాలున్న పొన్నగంటి కూర రోటి పచ్చడి