ఇది కదా నిజమైన ప్రేమంటే.. అన్న ఇచ్చిన గిఫ్ట్ చూసి బోరున ఏడ్చేసింది.. క్యూట్ వీడియో

|

Nov 11, 2022 | 7:10 PM

ఇంట్లో అక్కా చెల్లెళ్లు, అన్నా తమ్ముళ్ల మధ్య ఉండే ప్రేమను మాటల్లో చెప్పలేం. ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా ఆపదలో నేనున్నానని భరోసా ఇస్తారు. అమ్మా నాన్నల తర్వాత బాధ్యత అంతా వారిదే కాబట్టి తమ కంటే చిన్న వారికి..

ఇది కదా నిజమైన ప్రేమంటే.. అన్న ఇచ్చిన గిఫ్ట్ చూసి బోరున ఏడ్చేసింది.. క్యూట్ వీడియో
Brother Sister Love
Follow us on

ఇంట్లో అక్కా చెల్లెళ్లు, అన్నా తమ్ముళ్ల మధ్య ఉండే ప్రేమను మాటల్లో చెప్పలేం. ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా ఆపదలో నేనున్నానని భరోసా ఇస్తారు. అమ్మా నాన్నల తర్వాత బాధ్యత అంతా వారిదే కాబట్టి తమ కంటే చిన్న వారికి కంటికి రెప్పలా కాపాడుకుంటారు. కాబట్టే తోబుట్టువుల మధ్య ఉండే ప్రేమ జీవితంలోని ఇతర సంబంధాలకు వేరుగా ఉంటుంది. కష్ట సుఖాల్లో నేనున్నానంటూ మందుకు వచ్చే తెగువ ఒక్క తోబుట్టువులకు మాత్రమే సాధ్యం. చాలా ఇళ్లలో అన్నదమ్ములు, అన్నా చెల్లెళ్లు ఏదో ఒక విషయంలో గొడవ పడే దృశ్యాలను మనం కచ్చితంగా చూసే ఉన్నాం. అయితే ఒకరి కోసం మరొకరు ధైర్యంగా నిలబడే సమయం వచ్చినప్పుడు మాత్రం వెనుకడుగు వేయరు. అమ్మానాన్నలను కోల్పోయిన కొన్ని కుటుంబాల్లో తోబుట్టువులను కంటికి రెప్పలా కాపాడుకుని, వారిని జీవితంలో ఉన్నత స్థానంలో చేర్చిన అక్కలు, అన్నల గురించి మనం వార్తల్లో చూశాం. పేపర్లలో చదివాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారుతుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి తన సోదరికి స్కూటీని బహుమతిగా ఇచ్చాడు. వెహికిల్ తాళాలను ఓ గిఫ్ట్ బాక్స్ లో ప్యాక్ చేసి అందించాడు. ఆమె చాలా ఆతృతగా ఆ బాక్స్ ను ఓపెన్ చేసింది. అందులో ఉన్న బైక్ కీస్ ను చూసి ఆనందం తట్టుకోలేకపోయింది. భావోద్వేగానికి గురై బోరున ఏడ్చేసింది. ఆ బహుమతిని చూసి అన్నయ్యను కౌగిలించుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయిన ఈ వీడియోకు ప్యూర్ లవ్ అనే క్యాప్షన్ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను పోస్ట్ చేసిన కొద్ది సమయంలోనే వైరల్ గా మారింది. ఆనందంతో ఏడవడంతో అన్నయ్య కూడా ఎమోషనల్ అయిపోయాడు. వైరల్‌గా మారిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇలాంటి అన్నను కలిగి ఉన్న ఆ సోదరి చాలా అదృష్టవంతురాలు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..