భారదేశంలో అధిక శాతం వినియోగించే ఆహార ధాన్యాల్లో గోధుమలు ఒకటి. నార్త్ ఇండియాలో చాలా మంది ప్రజలు గోధుమ పిండితో చపాతీలు చేసుకుని ఆహారంగా తీసుకుంటారు. ప్రజలకు నిత్యవసరమైన వీటి ధరలు ఇప్పుడు రోజురోజుకు పెరిగిపోతుంది. కొన్ని ప్రాంతాల్లో కేజీ గోధుమలు రూ.50 నుంచి రూ.80 వరకు పలుకుతున్నాయి. ప్రస్తుతం అన్ని వస్తువుల ధరలు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రజల ఆదాయానికి మించి రేట్లు పెరిగిపోతుండటంతో పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చాలినంత డబ్బు లేక కడుపునిండా తినలేకపోతున్నారు. దీంతో అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ క్రమంలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) అధికారి పర్వీన్ కస్వాన్ షేర్ చేసిన బిల్లు నెట్టింట చక్కర్లు కొడుతోంది. 1987 నాటి బిల్లు చిత్రాన్ని ఆయన ట్వీట్ చేశారు. అప్పటి గోధుమ ధర చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అప్పుడు కిలో గోధుమ ధర రూ.1.6 గా ఉంది.
ఈ చిత్రాన్ని పంచుకుంటూ.. గోధుమలు కిలో రూ. 1.6 కు విక్రయించే కాలం నాటిదని రాశారు. ఇది తన తాతయ్యకు చెందిందని.. ఆయనకు బిల్లులు, రికార్డులు అన్నీ భద్రంగా దాచుకునే అలవాటు ఉందని చెప్పారు. 40 ఏళ్లుగా తన తాత అమ్మిన పంటలకు సంబంధించిన పత్రాలన్నీ తన వద్ద ఉన్నాయని తెలిపారు. ఈ ట్వీట్ ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది. ఇప్పటివరకు 42 వేల కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. వందల సంఖ్యలో లైక్స్ వచ్చాయి.
Time when wheat used to be at 1.6 rupees per kg. The wheat crop my grandfather sold in 1987 to Food Corporation of India. pic.twitter.com/kArySiSTj4
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) January 2, 2023
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. .