New Labour Codes: అమల్లోకి కొత్త కార్మిక చట్టాలు.. ఉద్యోగులకు టేక్ హోమ్ శాలరీ తగ్గుతుందా..?

కేంద్రం నూతన కార్మిక చట్టాలను అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. గత నెలలో వీటిని ప్రకటించగా.. అప్పటినుంచే అమల్లోకి వస్తాయని తెలిపింది. అయితే ఈ రూల్స్ వల్ల ఉద్యోగుల టేక్ హోమ్ శాలరీ తగ్గుతుందనే వార్తలు వస్తున్నాయి. దీంతో కార్మికశాఖ స్పష్టతనిచ్చింది.

New Labour Codes: అమల్లోకి కొత్త కార్మిక చట్టాలు.. ఉద్యోగులకు టేక్ హోమ్ శాలరీ తగ్గుతుందా..?
New Labour Codes

Updated on: Dec 11, 2025 | 9:19 PM

కేంద ప్రభుత్వం ఇటీవల కొత్త కార్మిక సంస్కరణలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పాత వాటిని పునరుద్దరించి కొత్త వాటిని ప్రవేశపెట్టింది. వీటి వల్ల అన్ని రంగాల్లోని ఉద్యోగులకు ఆర్ధిక, సామాజిక భద్రత లభించనుంది. గిగ్ వర్కర్లకు కూడా ఇవి వర్తించనున్నాయి. పాత వాటిల్లో మార్పులు చేసి కొత్తగా తెచ్చిన నాలుగు కార్మిక కోడ్‌లలో అనేక అంశాలపై ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఈ లేబర్ కోడ్‌లలో ఉద్యోగి జీతం నుంచి పీఎఫ్, ఇతర వెల్‌ఫేర్ స్కీమ్స్‌కు ఎక్కువ మొత్తంలో వాటా వెళ్లేలా నిబంధనలు ఉన్నాయని కొంతమందిలో అయోమయం నెలకొంది. దీని వల్ల టేక్ హోమ్ శాలరీ తగ్గుతుందనే వార్తలు వస్తు్న్నాయి. దీంతో కార్మిక శాఖ తాజాగా క్లారిటీ ఇచ్చింది.

కొత్త కార్మిక సంస్కరణల వల్ల టేక్ హోమ్ శాలరీలో ఎలాంటి మార్పులు ఉండవని కార్మికశాఖ తెలిపింది. ఈ మేరకు తన ఎక్స్ అకౌంట్‌లో ఒక పోస్ట్ పెట్టింది. ఈపీఎఫ్‌కి సంబంధించి చట్టబద్ద వేతన పరిమితి రూ.15 వేలుగానే ఉంది. దీనిపై కొత్త లేబర్ కోడ్‌ల ప్రభావం అసలు ఉండదని స్పష్టతనిచ్చింది. రూ.15 వేల పరిమితికి మంచి మీరు కాంట్రిబ్యూట్ చేసుకోవాలంటే అది మీ వ్యక్తిగత విషయమని తెలిపింది. కంపెనీలు తప్పనిసరిగా ఈ పరిమితిని అమలు చేయాల్సిన అవసరం కూడా లేదంది. ఉద్యోగి, కంపెనీ మధ్య మ్యూచువల్ అండర్‌స్టాడింగ్‌ను బట్టి పెంచుకోవాలా.. వద్దా అనేది సొంత నిర్ణయమని చెప్పుకొచ్చింది. దీని వల్ల మీ టేక్ హోమ్ శాలరీలో ఎలాంటి మార్పులు లేవని పేర్కొంది.

నెలకు రూ.60 వేల శాలరీ మీకు వస్తుదనుకున్నాం. పాత చట్టాల ప్రకారం ఈపీఎఫ్ ఉద్యోగి వాటా రూ.1800, కంపెనీ వాటా రూ.1800 పోతే రూ.56,400 టేక్ హోమ్ శాలరీ అందుతుంది. అయితే కొత్త లేబర్ కోడ్‌ల ప్రకారం ఈపీఎఫ్ గరిష్ట వేతన పరిమితిలో ఎలాంటి మార్పులు చేయలేదు. దీని వల్ల మీకు పాత విధానం ద్వారానే  టేక్ హోమ్ శాలరీలో ఎలాంటి మార్పులు ఉండవని కార్మికశాఖ స్పష్టం చేసింది. దీంతో ఉద్యోగులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.