ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌పోర్టులో కలకలం..! ట్రాలీ బ్యాగ్ లో రూ.40 కోట్ల విలువ‌ చేసే కొకైన్ స్వాధీనం.. ఎక్కడ్నుంచి తెచ్చారంటే..

|

Jan 12, 2024 | 12:27 PM

తెల్లటి పొడి లాంటి పదార్థాన్ని కలిగిన కొన్ని ప్యాకెట్లు సదరు మహిళ ప్రయాణికురాలి ట్రాలీ బ్యాగ్‌లో బయటపడ్డాయి. వాటిని పరీక్షించిన అధికారులు కొకైన్‌ అని గుర్తించారు. పట్టుబడిన కొకైన్‌ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు రూ.40 కోట్లుగా ఉంటుందని అంచనా వేౠరు. ఈ మేరకు సదరు మహిళపై

ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌పోర్టులో కలకలం..! ట్రాలీ బ్యాగ్ లో రూ.40 కోట్ల విలువ‌ చేసే కొకైన్ స్వాధీనం.. ఎక్కడ్నుంచి తెచ్చారంటే..
arrest
Follow us on

ముంబై విమానాశ్రయంలో పెద్ద మొత్తంలో కొకైన్‌ పట్టుబడింది. థాయ్‌లాండ్‌కు చెందిన మహిళా ప్రయాణికు రాలి వద్ద కోట్ల రూపాయల విలువ చేసే కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ అధికారులు.. కొకైన్‌ అక్రమ రవాణా జరుగుతోందన్న పక్కా సమాచారం మేరకు రంగంలోకి దిగిన అధికారులు వ్యూహాత్మకంగా సోదాలు జరిపారు..అడిస్‌ అబాబా నుంచి వచ్చిన 21 ఏళ్ల థాయ్‌ మహిళను అధికారులు ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఆమె లగేజీని నిశితంగా పరిశీలించగా అధికారులే కంగుతినేలా భారీ మొత్తంలో కొకైన్‌ పట్టుబడింది..

తెల్లటి పొడి లాంటి పదార్థాన్ని కలిగిన కొన్ని ప్యాకెట్లు సదరు మహిళ ప్రయాణికురాలి ట్రాలీ బ్యాగ్‌లో బయటపడ్డాయి. వాటిని పరీక్షించిన అధికారులు కొకైన్‌ అని గుర్తించారు. పట్టుబడిన కొకైన్‌ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు రూ.40 కోట్లుగా ఉంటుందని అంచనా వేౠరు. ఈ మేరకు సదరు మహిళపై నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ చట్టం కింద కేసు నమోదు చేసిన అధికారులు మహిళ ప్రయాణికురాలిని అదుపులోకి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..