ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ లో బర్ద్ ఫ్లూ కలకలం, శాంపిల్స్ లో పాజిటివ్, రిపబ్లిక్ డే వరకు ప్రజలకు అనుమతి నిషేధించిన ప్రభుత్వం

| Edited By: Pardhasaradhi Peri

Jan 19, 2021 | 3:48 PM

ఢిల్లీ లోని రెడ్ ఫోర్ట్ లో బర్ద్ ఫ్లూ కేసులు బయటపడ్డాయి. ఇక్కడ మరణించిన 15 కాకుల శాంపిల్స్ ను సేకరించి జలంధర్, భోపాల్ లోని ల్యాబ్స్ కు పంపగా..

ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ లో బర్ద్ ఫ్లూ కలకలం, శాంపిల్స్ లో పాజిటివ్, రిపబ్లిక్ డే వరకు ప్రజలకు అనుమతి నిషేధించిన ప్రభుత్వం
Follow us on

ఢిల్లీ లోని రెడ్ ఫోర్ట్ లో బర్ద్ ఫ్లూ కేసులు బయటపడ్డాయి. ఇక్కడ మరణించిన 15 కాకుల శాంపిల్స్ ను సేకరించి జలంధర్, భోపాల్ లోని ల్యాబ్స్ కు పంపగా పాజిటివ్ ఫలితాలు వచ్చాయి.  దీంతో రిపబ్లిక్ డే వరకు ఇక్కడికి ప్రజల ఎంట్రీపై నిషేధం విధించారు. ఈ నెల 26 వరకు రెడ్ ఫోర్ట్ ను మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. 26 న పరేడ్ కోసం దీన్ని మళ్ళీ ప్రారంభించాల్సి ఉంది. బర్ద్ ఫ్లూ నుంచి టూరిస్టులను, ప్రజలను రక్షించడానికి ఈ చర్య తీసుకున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. ఇప్పటికే దేశంలోని 10 రాష్ట్రాల్లో బర్ద్ ఫ్లూ కేసులు వెలుగులోకి వచ్చాయి.  మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, మహారాష్ట్ర, కేరళ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో కోళ్లు, బాతులను సంహరిస్తున్నారు. అనేక జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. బర్ద్ ఫ్లూ వల్ల తలెత్తే రుగ్మతలపై ఆయా ప్రభుత్వాలు ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నాయి. ఢిల్లీ పౌల్ట్రీ ఫ్రారాల్లోని కోళ్ల తాలూకు శాంపిల్స్ ని భోపాల్ ల్యాబ్ కు పంపగా నెగెటివ్ రిపోర్టులు వచ్చాయని ఇటీవల అధికారులు తెలిపారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా ఈ నగరంలోని ఘాజీపూర్ పౌల్ట్రీ మార్కెట్ ను మూసివేశారు.