కారు టైరులో దాగింది, ముప్పుతిప్పలు పెట్టి పట్టుబడింది

| Edited By: Pardhasaradhi Peri

Sep 23, 2020 | 3:58 PM

ముంబైలో ఎక్కడినుంచి వచ్చిందో గానీ ఓ భారీ కొండచిలువ రోడ్డుకు అడ్డం పడింది. తాపీగా  పార్క్ చేసి ఉన్న ఓ కారులో చొరబడింది. అయితే ఆ వాహనం టైరు భాగంలో చిక్కుకుపోయింది. అంతే, అది చూసిన వాహనదారులు..

కారు టైరులో దాగింది, ముప్పుతిప్పలు పెట్టి పట్టుబడింది
Follow us on

ముంబైలో ఎక్కడినుంచి వచ్చిందో గానీ ఓ భారీ కొండచిలువ రోడ్డుకు అడ్డం పడింది. తాపీగా  పార్క్ చేసి ఉన్న ఓ కారులో చొరబడింది. అయితే ఆ వాహనం టైరు భాగంలో చిక్కుకుపోయింది. అంతే, అది చూసిన వాహనదారులు, ప్రజలంతా భయపడుతూనే ఆశ్చర్యంగా ఆ వింతను షో లా చూస్తూ ఉండిపోయారు. ఎవరో స్నేక్ క్యాచర్లకు సమాచారమిస్తే వారు వఛ్చి అతి కష్టం మీద కారు టైరు ఊడదీసి దాన్ని బయటకు తీశారు. సుమారు 10 అడుగుల పొడవున్న ఈ పైథాన్ ని స్నేక్ క్యాచర్లు, అటవీ సిబ్బంది కొద్దిసేపు రోడ్డుపై ‘ప్రదర్శిస్తే’ ఇక జనం మరింతగా పోగయ్యారు. ట్రాఫిక్ జామ్ ఏర్పడిం ది. పట్టపగలు ఈ పైథాన్ షో ‘ ఓ గంట సేపు ‘జనరంజకం’ కాగా , చివరకు అటవీ సిబ్బంది దాన్ని తీసుకువెళ్లి థానే అడవుల్లో వదిలిపెట్టారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.