వింత కేసు! మహా శివుడికి జిల్లా కోర్టు నోటీసులు జారీ.. విచారణకు హాజరవ్వకపోతే రూ.10వేలు జరిమానా?

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాకు చెందిన తహసీల్దార్ కోర్టు (Tehsildar court) ప్రభుత్వ భూమిని కబ్జా చేసినందుకుగానూ దేవుడితో సహా 10 మందికి నోటీసులు ​​జారీ చేసింది..

వింత కేసు! మహా శివుడికి జిల్లా కోర్టు నోటీసులు జారీ.. విచారణకు హాజరవ్వకపోతే రూ.10వేలు జరిమానా?
Lord Shiva

Updated on: Mar 15, 2022 | 2:33 PM

Notice sent to Lord Shiva in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాకు చెందిన తహసీల్దార్ కోర్టు (Tehsildar court) ప్రభుత్వ భూమిని కబ్జా చేసినందుకుగానూ దేవుడితో సహా 10 మందికి నోటీసులు ​​జారీ చేసింది. విచారణకు హాజరుకానిపక్షంలో రూ.10,000లు జరిమానా కూడా విధించనున్నట్లు హెచ్చరించింది. భోలేనాథ్ అనే వ్యక్తి తన భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నారని వీరిపై ఆరోపణలు చేస్తూ కేసు వేశాడు. ఛత్తీస్‌గఢ్‌లో ఈ తరహాలో ఏకంగా మహాశివుడికి నోటీసులు జారీ చేయడం ఇది రెండో సారి. ఈ కేసులో అందిన సమాచారం ప్రకారం.. రాయ్‌గఢ్‌లోని వార్డు నంబర్-25లోని శివాలయంతో సహా మొత్తం 16 మంది ప్రభుత్వ భూమిని ఆక్రమించారని ఆరోపిస్తూ సుధా రాజ్‌వాడే బిలాస్‌పూర్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, తహసీల్దార్‌ కార్యాలయాన్ని హైకోర్టు కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు తహసీల్దార్ కార్యాలయం 10 మందికి నోటీసులు ఇచ్చింది. ఐతే సదరు నోటీసులో శివాలయం పేరు కూడా ఉంది. నోటీసులు ఆలయ ధర్మకర్తకుకానీ, పూజారికి కానీ పంపకుండా నేరుగా శివాలయానికి అంటే శివుడికి జారీ చేయబడిందన్నమాట.

ఈ విధంగా లార్డ్ శంకర్‌కు పంపిన నోటీసులో.. చత్తీస్‌గఢ్ ల్యాండ్ రెవెన్యూ కోడ్ సెక్షన్ కింద ప్రభుత్వ భూమిని ఆక్రమించినందుకుగానూ 10 మందిపై కేసు నమోదైందని, మార్చి 23న విచారణకు హాజరుకాకపోతే రూ.10 వేలు జరిమానా విధించనున్నట్లు తహసీల్దార్ కోర్టు సమీన్లు జారీ చేసింది. అప్పటివరకు సదరు భూమిలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టడానికి అనుమతి లేదని కోర్టు హెచ్చరించింది. ఇక ఈ నోటీసుపై మహా శివుడు స్పందిస్తాడా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. నిజానికి ఆక్రమిత భూమిలో శివాలయం కూడా ఉంది. దీంతో శివాలయంతోపాటు మిగిలిన అందరికీ నోటీసులు జారీ చేస్తూ పది రోజుల సమయం ఇచ్చింది కోర్టు. ఆ తర్వాత తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు ఈ సందర్భంగా కోర్టు తెల్పింది. గతంలో కూడా జాంజ్‌గిర్-చంపా జిల్లా నీటిపారుదల శాఖ సంబంధిత అధికారులకుకాకుండా నేరుగా శివాలయానికి నోటీసు జారీ చేసింది.

Also Read:

Banana Side Effects: మీకు అరటిపండ్లంటే ఇష్టమా? ఐతే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..