వీళ్లు మహా కంత్రీగాళ్లు.. ఒకటిన్నర నిమిషాల వ్యవధిలోనే రూ. 2 లక్షలు కొట్టేశారు..!

|

Dec 25, 2024 | 8:39 AM

తమిళనాడులో దొంగలు పట్టపగలు రెచ్చిపోయారు. టూ వీలర్‌ను వెంబడించి ఒకటిన్నర నిమిషాల వ్యవధిలోనే రూ.2లక్షలు కొట్టేశారు. తమిళనాడులో జరిగిన ఈ ఘటనపై తీవ్ర కలకలం సృష్టించడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఆరుగురు వ్యక్తులు వెంబడించి మరీ డబ్బులు కాజేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

వీళ్లు మహా కంత్రీగాళ్లు..  ఒకటిన్నర నిమిషాల వ్యవధిలోనే రూ. 2 లక్షలు కొట్టేశారు..!
Cash Stolen From Two Wheeler
Follow us on

పట్టపగలు టూ వీలర్‌ను వెంబడించి ఒకటిన్నర నిమిషాల వ్యవధిలోనే ద్విచక్ర వాహనంలోని రూ.2లక్షలు అపహరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. తమిళనాడులో జరిగిన ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

అవినాశి కామరాజ్ నగర్‌కు చెందిన షణ్ముగం (55) రైతు. తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం అవినాసిలోని బ్యాంకుకు వెళ్లి రూ. 2 లక్షలు తీసుకుని వాహనం వెనుక సీటు కింద దాచిపెట్టాడు. అనంతరం డబ్బులతో అదే ప్రాంతంలోని దుకాణం సమీపంలో ద్విచక్రవాహనాన్ని ఆపి లోపలికి వెళ్లాడు. అప్పుడు అతనికి తెలియకుండా 3 ద్విచక్రవాహనాలలో వచ్చిన ఆరుగురు దుండగులు అతడిని వెంబడించి, టూవీలర్ వెనుక సీటు తాళం పగులగొట్టి రూ. 2 లక్షలు అపహరించుకుని వెళ్లారు. షణ్ముగం బయటకు వచ్చి బైక్‌ను చూడగా వెనుక సీటు తాళం పగులగొట్టి ఉండడంతో షాక్‌కు గురయ్యాడు.

బండిలో ఉంచిన డబ్బులు కూడా లేకపోవడంతో లబోదిబోమన్నాడు. ఇందుకు సంబంధించి ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాను పరిశీలించగా.. షణ్ముఖను వెంబడించిన ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు కేవలం ఒకటిన్నర నిమిషాల వ్యవధిలోనే డబ్బును అపహరించినట్లు తేలింది. ఈ ఘటనపై అవినాసి పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

వీడియో చూడండి.. 

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..