దేశంలో ఉగ్రమూకలు భారీ విధ్వంసానికి స్కెచ్ వేశారా..? సైలెంట్‌గా తమ పని కానిస్తున్నారా..? భారీ ప్రాణ నష్టం తప్పదా..? అంటే అవుననే అంటున్నాయి నిఘా వర్గాలు. దీంతో.. అలర్ట్ అయిన జాతీయ దర్యాప్తు సంస్థలు గట్టి నిఘాను ఏర్పాటు చేశాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు వ్యాప్తంగా ఎన్‌ఐఏ దాడులు నిర్వహిస్తోంది.
తమిళనాడు వ్యాప్తంగా ఎన్ఐఏ అధికారులు భారీగా అరెస్టులు చేస్తున్నారు. తేని, మధురై, పెరంబలూరు, తిరునల్వేలి, రామనాథపురంకు చెందిన 14 మందిని అరెస్ట్ చేశారు. అన్జారుల్లా అనే తీవ్రవాద సంస్థతో సంబంధాలు, ఆ సంస్థకు నిధుల సమీకరణలు, ఇతర తీవ్రవాద కార్యకలాపాలతో వారందరికీ లింక్ వున్న నేపథ్యంలో వారిని అరెస్ట్ చేసినట్టు ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. వారి వద్ద నుంచి పలు ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డిస్క్‌లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ 14 మందిని జులై 25 వరకు రిమాండ్‌లో వుంచి విచారించనున్నట్లు సమాచారం. కాగా.. నిన్నకూడా నలుగురు అనుమానితులను ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు.