Dahi Controversy: సీఎం స్టాలిన్‌కి జే కొట్టిన అన్నామలై.. ‘దహీ’ నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్

|

Mar 30, 2023 | 11:07 AM

ఇదే కొనసాగితే.. భాషా ఉద్యమం తప్పదని.. ఏకంగా దక్షిణాదిలో హిందీ భాషను బ్యాన్ చేసే దిశగా ఉద్యమం చేస్తామంటూ హెచ్చరించారు కూడా.. ఇదే విషయంపై తమిళనాడు బిజెపి అధ్యక్షుడు అన్నామలై స్పందిస్తూ.. సీఎం స్టాలిన్ వ్యాఖ్యలను సమర్ధించారు.

Dahi Controversy: సీఎం స్టాలిన్‌కి జే కొట్టిన అన్నామలై.. దహీ నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్
K Annamalai
Follow us on

తమ సంస్కృతి, సాంప్రదాయాలను, భాషాభిమానాన్ని కాపాడుకునే విషయంలో అందరం ఒకటే అని నిరూపిస్తూ ఉంటారు తమిళనాడుకి చెందిన రాజకీయనేతలు.. రాజకీయాలు వేరు..తమ ప్రాంతీయ వాదం వేరని పలు సందర్భాల్లో నిరూపిస్తూనే ఉన్నారు. తాజాగా పెరుగు ప్యాకెట్ మీద తమిళ భాషకు చెందిన పదం బదులు హిందీ పదం ముద్రించే విషయంలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే..ఇప్పటికే . సీఎం స్టాలిన్‌ పెరుగు ప్యాకెట్లపై హిందీని ముద్రించాలని నందిని పాల ఉత్పత్తి సంస్థకు కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై  ఘాటుగా స్పందించారు. ఇదే కొనసాగితే.. భాషా ఉద్యమం తప్పదని.. ఏకంగా దక్షిణాదిలో హిందీ భాషను బ్యాన్ చేసే దిశగా ఉద్యమం చేస్తామంటూ హెచ్చరించారు కూడా.. ఇదే విషయంపై తమిళనాడు బిజెపి అధ్యక్షుడు అన్నామలై స్పందిస్తూ.. సీఎం స్టాలిన్ వ్యాఖ్యలను సమర్ధించారు.

ఈ మేరకు ప్రభుత్వ ఆధ్వర్యంలోని సహకార సంఘాలు ఉత్పత్తి చేసే పెరుగు సాచెట్‌లపై ‘దహీ’ని ఉపయోగించాలని కోరుతూ ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఛైర్‌పర్సన్‌కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై లేఖ రాశారు. రాష్ట్ర పరిధిలో ఉన్న అంశాలపై కేంద్ర సంస్థల జోక్యం తగదన్నారు. ఈ నోటిఫికేషన్ ప్రాంతీయ భాషలను ప్రోత్సహిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి పొంతన లేదని అన్నామలై అన్నారు. అంతేకాదు “దహీ” ని ఉపయోగించాలని కోరుతూ అథారిటీ విడుదల చేసిన నోటిఫికేషన్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ చైర్‌పర్సన్‌ను కోరారు.

పెరుగు ఉత్పత్తులపై హిందీ వేయాలన్న నిబంధన తగదని చెప్పారు. ఈ విషయంపై తాము కేంద్రంతో మాట్లాడుతామని తెలిపారు. ఇదే విషయాన్నీ తమకు ప్రధాని మోడీ  దృష్టికి తీసుకెళతామని చెప్పారు అన్నామలై.. రాష్ట్ర పరిధిలోని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడపబడే సహకార పాల సంఘాలు వారి సంబంధిత ప్రాంతీయ భాషను ఉపయోగించేందుకు అనుమతించమని.. పెరుగు సాచెట్‌లపై ప్రాంతీయ భాషను ఉపయోగించే విధంగా కోరనున్నామని చెప్పారు బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..