AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లైన్ క్లియర్.. విజయ్ వైపు తిరుమావళవన్.. టీవీకేకు మద్దతు పలికిన వీసీకే..!

తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీకి విడుతలై చిరుతైగల్ కట్చి (VCK) మద్దతు ప్రకటించింది. ఈ మేరకు వీసీకే అధినేత తోల్ తిరుమావళవన్, టీవీకే నేతలకు అధికారికంగా ఒక లేఖను అందజేశారు. దీంతో విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి.

లైన్ క్లియర్.. విజయ్ వైపు తిరుమావళవన్.. టీవీకేకు మద్దతు పలికిన వీసీకే..!
Vck Chief Thol. Thirumavalavan Support To Vijay
Balaraju Goud
|

Updated on: May 09, 2026 | 4:53 PM

Share

తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీకి విడుతలై చిరుతైగల్ కట్చి (VCK) మద్దతు ప్రకటించింది. ఈ మేరకు వీసీకే అధినేత తోల్ తిరుమావళవన్, టీవీకే నేతలకు అధికారికంగా ఒక లేఖను అందజేశారు. దీంతో విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి.

ఇటీవల టీవీకే నేతలు తిరుమావళవన్‌ను కలిసి చర్చలు జరిపారు. ఈ భేటీ అనంతరం, వీసీకే తన మద్దతును తెలియజేస్తూ రాసిన లేఖను టీవీకే కీలక నేత, ఎమ్మెల్యే అదవ అర్జున్ స్వీకరించారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, సామాజిక న్యాయం మరియు ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా ఈ రెండు పార్టీల మధ్య సాన్నిహిత్యం పెరుగుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. విజయ్ నేతృత్వంలోని టీవీకేకు దళిత మరియు బహుజన ఓటు బ్యాంకు ఉన్న వీసీకే మద్దతు లభించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇప్పటికే కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీల మద్దతు కూడగట్టిన విజయ్‌కు, తాజా వీసీకే నిర్ణయంతో మొత్తం 118 మంది ఎమ్మెల్యేల బలం సమకూరింది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ దాటడంతో టీవీకే శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా సంబరాల్లో మునిగిపోయాయి. “ఒక కుర్చీ – నాలుగు కాళ్లు” అన్నట్లుగా నాలుగు పార్టీల మద్దతుతో విజయ్ పీఠం వైపు అడుగులు వేస్తున్నారు.

తాజా మద్దతు లేఖలతో విజయ్ కాసేపట్లో లోక్ భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలవనున్నారు. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ నెలకొంది. రాత్రి 7 గంటలకు గవర్నర్‌కు కేరళ ఫ్లైట్ ఉంది. అంటే గంటలోపే ఈ పొలిటికల్ మీటింగ్ ముగిసి, ప్రమాణ స్వీకార ముహూర్తంపై స్పష్టత రావాలి. అయితే మెజార్టీ లేఖలను పరిశీలించిన తర్వాత గవర్నర్ ఇప్పుడే నిర్ణయం ప్రకటిస్తారా? లేక కేరళ పర్యటన ముగించుకుని వచ్చాక తేదీని ఖరారు చేస్తారా? అన్నది సస్పెన్స్‌గా మారింది. ఒకవేళ గవర్నర్ సానుకూలంగా స్పందిస్తే, తమిళనాడు రాజకీయ చరిత్రలో విజయ్ కొత్త అధ్యాయాన్ని లిఖించబోతున్నారు. గడియారం ముల్లు వేగంగా తిరుగుతుండటంతో, అందరి కళ్లు లో్క్ భవన్‌పైనే ఉన్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us