Tamil Nadu Urban Local Bodies Election: తమిళనాడులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార పార్టీ డీఎంకే తిరుగులేని మెజారిటీతో గెలుపొందింది. ఈ ఎన్నికలలో దాదాపు అన్ని ప్రాంతాల్లో డీఎంకే అభ్యర్థులు గెలిచారు. ఈ క్రమంలో ట్రాన్స్ జెండర్ గంగా నాయక్ (Ganga Nayak) తమిళనాడు ఎన్నికల్లో చరిత్ర లిఖించారు. కార్పోరేషన్ ఎన్నికల్లో గెలిచిన తొలి ట్రాన్స్‌జెండర్‌గా గంగా నిలిచారు. వేలూరు (Vellore) మునిసిపల్ కార్పొరేషన్‌కు చెందిన గంగానాయక్ 37వ వార్డు అభ్యర్థిగా విజయం సాధించారు. డీఎంకే (DMK) తరపున వేలూరులోని మొత్తం 60 వార్డులకు అభ్యర్థులను ప్రకటించారు. ఈ క్రమంలో వేలూరు పాతబస్తీలోని 37వ వార్డు అభ్యర్థిగా బరిలో నిలిచిన ట్రాన్స్‌జెండర్ ఆర్.గంగ (49) 15 ఓట్ల మెజారిటితో గెలిచినట్లు అధికారులు తెలిపారు.
డీఎంకే అధిష్టానం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు గంగ. తనకిచ్చిన ఈ అవకాశంపై గంగా డీఎంకే అధినేత సీఎం స్టాలిన్‌కు ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజులలో సీఎం స్టాలిన్ ప్రతి జిల్లాలో ట్రాన్స్‌జెండర్‌లకు అవకాశం ఇస్తే ట్రాన్స్‌జెండర్ల బతుకులు మారుతాయని, పురుషులు, మహిళలతో సమానంగా ట్రాన్స్‌జెండర్లకు సమాన హక్కు దక్కుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ సమాజంలో అందరికీ సమాన అవకాశాలు దక్కేలా డీఎంకే అధినేత నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు గంగా పేర్కొన్నారు.
20 ఏళ్లుగా డీఎంకే అభ్యర్థిగా ఉన్న గంగా.. తన కమ్యూనిటీకి అందిస్తున్న సేవలు మరింత విస్తరిస్తానని పేర్కొన్నారు. ప్రస్తుతం గంగా నాయక్ సౌత్ ఇండియా ట్రాన్స్‌జెండర్ అసోసియేషన్‌కు కార్యదర్శిగా ఉన్నారు.
Also Read: