Viral Video: ‘గుండె బరువెక్కింది.. కళ్లు చెమ్మగిల్లాయి.. నిన్ను మర్చిపోలేం’ హార్ట్‌ టచింగ్‌ వీడియో

|

Mar 08, 2023 | 1:14 PM

వారిది ఏళ్లుగా పెనవేసుకున్న బంధం. విధుల నిర్వహణలో ఎన్నో సాహసాలు చేసి అందరి ప్రసంశలు పొందింది. రిటైర్‌మెంట్‌ వయసు రావడంతో తమ బంధానికి చమ్మగిల్లిన కళ్లతో, బరువెక్కిన హృదయాలతో వీడుకోలు పలికారు. ఇదేదో ఆఫీస్‌ ఉద్యోగుల..

Viral Video: గుండె బరువెక్కింది.. కళ్లు చెమ్మగిల్లాయి.. నిన్ను మర్చిపోలేం హార్ట్‌ టచింగ్‌ వీడియో
Kumki Elephant
Follow us on

వారిది ఏళ్లుగా పెనవేసుకున్న బంధం. విధుల నిర్వహణలో ఎన్నో సాహసాలు చేసి అందరి ప్రసంశలు పొందింది. రిటైర్‌మెంట్‌ వయసు రావడంతో తమ బంధానికి చమ్మగిల్లిన కళ్లతో, బరువెక్కిన హృదయాలతో వీడుకోలు పలికారు. ఇదేదో ఆఫీస్‌ ఉద్యోగుల పదవీ విరమణ కార్యక్రమం గురించిన చర్చ అనుకుంటున్నారా..? కానేకాదు. తమిళనాడులోని ఓ ఏనుగు పదవీవిరమణకు అక్కడి అటవీ పోలీసధికారుల భావోద్వేగానికి సంబంధించిన సంఘటన. తమిళనాడులో ఓ కుమ్కీ ఏనుగు 60 ఏళ్ల వయసులో మంగళవారం (మార్చి 7) నాడు పదవీ విరమణ పొందింది (గాయపడిన లేదా ఇతర ప్రమాదాల్లో చిక్కుకున్న ఏనుగులను రక్షించేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఏనుగులను కుమ్కీ ఏనుగులు అంటారు. వివిధ రెస్క్యూ ఆపరేషన్లలో అటవీ అధికారులు ఈ ఏనుగులను ఉపయోగిస్తారు). ఆ రాష్ట్రంలోని కోజియాముట్టి ఏనుగు శిబిరానికి చెందిన ‘కలీమ్‌’ అనే కుమ్కీ ఏనుగుకు పదవీ విరమణ సందర్భంగా అటవీ అధికారులు గౌరవ వందనం (గార్డ్ ఆఫ్ హానర్‌) చేశారు. కలీమ్‌ దాదాపు 99 రెస్క్యూ ఆపరేషన్‌లలో పాల్గొని అందరి మన్ననలు పొందింది.

ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం అటవీశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి సుప్రియా సాహు ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియలో పోస్టు చేశారు. ‘కుమ్కీ ఏనుగు ‘కలీం’ ఈ రోజు పదవీవిరమణ పొందింది. తమిళనాడులోని అనమలై టైగర్ రిజర్వ్‌లోని 99 రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొన్న కలీం ఓ లెజెండ్‌. కలీమ్‌ పదవీ విరమణ చేస్తుంటే మా కళ్లు చెమ్మగిల్లాయి. మా హృదయాలు కృతజ్ఞతతో నిండిపోయాయని’ సుప్రియా సాహు తన పోస్టులో రాసుకొచ్చారు. ఈ వీడియోలో పోలీసధికారులు అందరూ ఏనుగు ముందు నిలబడి సెల్యూట్‌ చేయడం కనిపిస్తుంది. వెంటనే ఏనుగు ఘీంకరిస్తూ తొండం పైకెత్తి అది కూడా వందనం చేయడం వీడియోలో కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

కాగా అటవీ ఏనుగులకు శిక్షణ ఇచ్చి, కుమ్కీ ఏనుగులుగా మార్చడంపై గత కొంతకాలంగా జంతు ప్రేమికులు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్న విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.