Viral: ఇదేం విగ్రహమో మీకు తెలుసా..? ధర ఎంతో తెలిస్తే నివ్వెరపోతారు

|

Aug 06, 2022 | 2:02 PM

ఇది తమిళనాడు సేతుపతి వంశానికి చెందిన పురాతన మహిళ విగ్రహం. ఆ విగ్రహం ఖరీదు కోట్లలో ఉంటుంది. పూర్తి వివరాలు.....

Viral: ఇదేం విగ్రహమో మీకు తెలుసా..? ధర ఎంతో తెలిస్తే నివ్వెరపోతారు
Antique Idol
Follow us on

Tamil Nadu: ముల్లును.. ముల్లుతోనే తీయాలి. కేటుగాళ్లను పట్టాలంటే వాళ్ల రూట్‌లోనే వెళ్లాలి. అదే ఫార్ములా ఫాలో అయ్యి.. సేతపతి వంశానికి( Sethupathy clan) చెందిన 400 సంవత్సరాల నాటి అరుదైన మహిళ విగ్రహాన్ని స్వాధీనం చేసుకుంది పోలీస్ ఐడల్‌ వింగ్‌ టీమ్. ఈ ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. దీని విలువ దాదాపు రూ.2 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. తూత్తుకుడికి చెందిన కుమార్‌వేల్‌, ఆరుముగరాజ్‌ ఈ పురాతన విగ్రహాన్ని అమ్మి సొమ్ము చేసేందుకు యత్నించారు. దీనిపై పోలీసులకు ఉప్పు అందింది. దీంతో ఐడల్‌ వింగ్‌ రంగంలోకి దిగింది. ఆ టీమ్‌లోని కొందరు సభ్యులు.. తాము బాగా రిచ్ పీపుల్ అని నమ్మబలికి.. విగ్రహాన్ని కొంటామంటూ వారిని సంప్రదించారు. తిరుచ్చి-మ‌ధురై హైవే( Trichy-Madurai highway)పై స్పాట్ ఫిక్స్ చేశారు. బేరసారాలు జరపిన అనంతరం తమకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నిజమని నిర్ధారించుకున్నారు. అనంతరం మెరుపు దాడి చేసి.. వారిని అదుపులోకి తీసుకుని విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శివగంగై జిల్లాలో నివాసం ఉండే  సెల్వకుమార్  నుంచి ఈ విగ్రహం తమ వద్దకు వచ్చిందని నిందితులు విచారణలో తెలిపారు. దీంతో స్పెషల్ టీమ్ ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ షురూ చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..