తమిళనాడు ఎయిర్ పోర్టులో 45 బాల్ పైథాన్ స్నేక్‌లను అక్రమంగా తరలిస్తున్న స్మగ్లర్లను చెన్నై కస్టమ్స్ అధికారులు గత బుధవారం (జనవరి 11) అరెస్ట్ చేశారు. పైథాన్‌లతోపాటు 3 మార్మోసెట్‌లు, 3 స్టార్ తాబేళ్లు, 8 కార్న్ స్నేక్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని బ్యాంకాక్ నుంచి అక్రమంగా తరలిస్తున్న విదేశీ వన్య ప్రాణులుగా అధికారులు గుర్తించారు. సామాను క్లెయిమ్ బెల్ట్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న రెండు బాక్స్‌లను అధికారులు తనిఖీ చేయగా అసలు విషయం బయట పడింది. జంతు నిర్బంధం, ధృవీకరణ సేవల విభాగం జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం రక్షించబడిన జంతువులను గురువారం (జనవరి 12) బ్యాంకాక్‌కు తిరిగి పంపించినట్లు చెన్నై కస్టమ్స్ తన ట్విటర్ ఖాతాలో ట్వీట్ చేసింది. ఐతే నిందితుల వివరాలు ఇంకా తెలియరాలేదు.
కాగా ఇటీవల కాలంలో చెన్నై విమానాశ్రయంలో విదేశీ వన్య ప్రాణులను పలుమార్లు అక్రమంగా తరలిస్తు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. గత నవంబర్‌లో ఓ ప్రయాణికుడి సామానులో రెండు పిగ్మీ మార్మోసెట్‌లు, రెండు డస్కీ లీఫ్ మంకీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు ఆగస్టులో కూడా ఓ ఒక ప్రయాణికుడి లగేజీలో ఓ డెబ్రాజా మంకీ, 15 కింగ్‌స్నేక్స్, 5 బాల్ ఫైథాన్‌లు, 2 అల్డాబ్రా తాబేళ్లు స్వాధీనం చేసుకున్నారు.
(1/2) On 11.01.23, two un-attended bags found near baggage claim belt of a pax who arrived from Bangkok by FD-153 were examined by Customs.
On examination, 45-Ball Pythons, 3-Marmoset, 3-Star Tortoise and 8-Corn Snakes were recovered.
Further investigation is under progress. pic.twitter.com/JHxFwQbqxU
— Chennai Customs (@ChennaiCustoms) January 16, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.