Senthil Balaji: అరెస్టైన గంటల వ్యవధిలోనే మంత్రి అస్వస్థత.. అర్జెంట్‌ సర్జరీ చేయాలంటోన్న వైద్యులు

మనీలాండరింగ్ కేసులో తమిళనాడు మంత్రి, డీఎంకే నేత సెంథిల్‌ బాలాజీ బుధవారం (జూన్‌ 14) అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం మంత్రిని అరెస్ట్‌ చేసి తరలిస్తు్న్న సమయంలో ఛాతి నొప్పి రావడంతో చెన్నైలోని మల్టీ సూపర్ స్పెషాలిటీ..

Senthil Balaji: అరెస్టైన గంటల వ్యవధిలోనే మంత్రి అస్వస్థత.. అర్జెంట్‌ సర్జరీ చేయాలంటోన్న వైద్యులు
Senthil Balaji

Updated on: Jun 14, 2023 | 3:19 PM

చెన్నై: మనీలాండరింగ్ కేసులో తమిళనాడు మంత్రి, డీఎంకే నేత సెంథిల్‌ బాలాజీ బుధవారం (జూన్‌ 14) అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం మంత్రిని అరెస్ట్‌ చేసి తరలిస్తున్న సమయంలో ఛాతి నొప్పి రావడంతో చెన్నైలోని మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కి తరలించారు. ఈ క్రమంలో వైద్యులు ఆయనకు కరోనరీ యాంజియోగ్రామ్ చేశారు. ఆయనకు చికిత్స నందించిన వైద్యులు మీడియాతో మాట్లాడుతూ.. సెంథిల్ బాలాజీ ఈ రోజు కరోనరీ యాంజియోగ్రామ్ చేయించుకున్నారని, వీలైనంత త్వరగా బైపాస్ సర్జరీ చేయాలని తెలిపారు.

కాగా మంత్రి బాలాజీ కార్యాలయం, కరూర్‌లోని నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ అధికారులకు ఆధారాలు లభించాయి. 18 గంటల పాటు మంత్రి సెంథిల్‌ను సుదీర్ఘంగా ప్రశ్నించింది. అనంతరం ఈ రోజు ఉదయం తెల్లవారుజామున మంత్రి బాలాజీని ఈడీ అరెస్టు చేసి తరలిస్తున్న సమయంలో ఆయన ఆస్వస్థతకు గురయ్యారు.

ఇవి కూడా చదవండి


దీంతో ఈడీ అధికారులు కట్టుదిట్టమైన భద్రత మధ్య బాలాజీని వైద్య పరీక్షల కోసం చెన్నైలోని ఒమందురార్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో బాలాజీని కారులో తరలిస్తున్న సమయంలో నొప్పితో మెలికలు తిరుగుతూ కనిపిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్‌తో సహా పలువురు డీఎంకే నేతలు బాలాజీ అరెస్టును ఖండించారు. బాలాజీని హింసించారని, అన్ని గంటలపాటు ప్రశ్నించడం అంత అనవసరం లేదని ఈడీ చర్యను తప్పుబట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.