జమ్ముకశ్మీర్‌లో చిక్కుకున్న 56 మంది తమిళ విద్యార్థులు.. రంగంలోకి స్టాలిన్ సర్కార్..!

జమ్ముకశ్మీర్‌లో 56 మంది విద్యార్థులు చిక్కుకుపోవడంతో తమిళనాడు సర్కార్ అప్రమత్తమైంది. వారిని క్షేమంగా తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. పహల్గామ్‌ ఉగ్రదాడి ఘటనతో భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా హైలర్ట్‌ కొనసాగుతోంది. సరిహద్దుల వెంబడి కాల్పులు జరుపుతూ, క్షిపణి దాడులకు పాల్పడుతోంది. వాటిని భద్రతా బలగాలు తిప్పికొడుతున్నాయి.

జమ్ముకశ్మీర్‌లో చిక్కుకున్న 56 మంది తమిళ విద్యార్థులు.. రంగంలోకి స్టాలిన్ సర్కార్..!
Mk Stalin

Updated on: May 10, 2025 | 12:21 AM

జమ్ముకశ్మీర్‌లో 56 మంది విద్యార్థులు చిక్కుకుపోవడంతో తమిళనాడు సర్కార్ అప్రమత్తమైంది. వారిని క్షేమంగా తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. పహల్గామ్‌ ఉగ్రదాడి ఘటనతో భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా హైలర్ట్‌ కొనసాగుతోంది. సరిహద్దుల వెంబడి కాల్పులు జరుపుతూ, క్షిపణి దాడులకు పాల్పడుతోంది. వాటిని భద్రతా బలగాలు తిప్పికొడుతున్నాయి.

ఈ క్రమంలోనే తమిళనాడుకు చెందిన 56 మంది విద్యార్థులు జమ్ము కశ్మీర్‌లో చిక్కుకుపోయారు. తమిళనాడుకు చెందిన 52 మంది విద్యార్థులు జమ్ము కశ్మీర్‌లోని పలు విద్యాసంస్థల్లో విద్యను అభ్యసిస్తున్నారు. అలాగే ఇటీవలే తమిళనాడుకు రాష్ట్రానికి చెందిన మరో నలుగురు విద్యార్థులు విజ్ఞాన యాత్ర కోసం జమ్ము కశ్మీర్ వెళ్లారు. దీంతో అప్రమత్తమైన తమిళనాడు సర్కారు వారిని క్షేమంగా ఇంటికి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది.

ఇప్పటికే విమాన సర్వీసులు నిలిచిపోవడంంతో.. 56 మంది విద్యార్థులను రోడ్డు మార్గంలో తిరిగి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఢిల్లీలోని తమిళనాడు భవన్‌లో 24 గంటలూ అందుబాటులో ఉండే హెల్ప్ లైన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా ల్యాండ్ లైన్‌తో పాటు వాట్సాప్ నెంబర్లకు వెంటనే సమాచారం ఇవ్వాలని తమిళనాడు సర్కారు సూచించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..