సీఎంగా దళపతి.. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్.. ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే..?

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇవాళ మరోసారి గవర్నర్‌తో విజయ్ భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతివ్వాలని.. అసెంబ్లీలో బలం నిరూపించుకుంటానని చెప్పారు. దీంతో గవర్నర్ అనుమతిచ్చారు. గవర్నర్ అనుమతి ఇవ్వడంతో సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సీఎంగా దళపతి.. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్.. ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే..?
Tvk Vijay Gets Green Signal From Governor To Form Government

Updated on: May 07, 2026 | 12:10 PM

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు టీవీకే అధినేత విజయ్‌కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇవాళ లోక్‌భవన్‌లో గవర్నర్‌తో రెండోసారి భేటీ అయిన విజయ్.. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతివ్వాలని.. అసెంబ్లీలో బలం నిరూపించుకుంటానని చెప్పారు. దీంతో గవర్నర్ అనుమతిచ్చారు. దాదాపు గంటకు పైగా సాగిన ఈ భేటీలో గవర్నర్ పలు కీలక ప్రశ్నలను విజయ్ ముందు ఉంచినట్లు సమాచారం. సభలో ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా, ప్రస్తుతం టీవీకేకు ఉన్న 112 మందితో పరిపాలన ఎలా సాగిస్తారు?, మెజారిటీకి కావాల్సిన మిగిలిన ఎమ్మెల్యేల మద్దతు ఏ పార్టీల నుండి వస్తుంది? ఇతర పార్టీలు మద్దతు ఇవ్వడానికి అంగీకరించాయా? వంటి ప్రశ్నలను గవర్నర్ విజయ్ ముందుంచారు. అయితే ప్రమాణస్వీకారం తర్వాత అసెంబ్లీలో బలం నిరూపించుకుంటానని విజయ్ చెప్పడంతో గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

గవర్నర్ అనుమతివ్వడంతో విజయ్ ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకవేళ గవర్నర్ తన అభ్యర్థనను తిరస్కరిస్తే, ఊరికే కూర్చోకుండా చట్టపరమైన మార్గాలనుఅనుసరించడానికి కూడా టీవీకే సిద్ధమైందని పార్టీ వర్గాల సమాచారం. మెజారిటీ నిరూపించుకునే అవకాశం తమకు ఉందనే నమ్మకంతో విజయ్ టీమ్ ముందుకు వెళ్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 108 స్థానాల్లో టీవీకే విజయం సాధించింది. అయితే రెండు చోట్ల గెలిచిన విజయ్ ఒక స్థానానికి రాజీనామా చేయనున్నారు. ఇక టీవీకే పార్టీకి ఇప్పటికే కాంగ్రెస్ మద్ధతు ప్రకటించగా.. ఇతర పార్టీల మద్ధతు కోసం విజయ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

Follow Us