AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘పోర్న్ చూసేది అందుకేనట’.. సర్వేలో బయటపడిన సంచలన నిజాలు..

కోవిడ్ వేవ్ ప్రారంభం నుంచి పిల్లలు, టీనేజర్లపై మొబైల్ ఫోన్ల ప్రభావం బాగా ఎక్కువైపోయింది. వారి స్క్రీన్ సమయంలో..

'పోర్న్ చూసేది అందుకేనట'.. సర్వేలో బయటపడిన సంచలన నిజాలు..
Mobile Addicted
Ravi Kiran
|

Updated on: Feb 02, 2023 | 12:49 PM

Share

కోవిడ్ వేవ్ ప్రారంభం నుంచి పిల్లలు, టీనేజర్లపై మొబైల్ ఫోన్ల ప్రభావం బాగా ఎక్కువైపోయింది. వారి స్క్రీన్ సమయంలో విపరీతంగా పెరుగుతోందని.. తద్వారా మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం పడే అవకాశం ఉందని ఎంతోమంది తల్లిదండ్రులు కంగారుపడుతుండటం మనం చూస్తూనే ఉంటాం. అయితే పిల్లలు గానీ, టీనేజర్లు గానీ.. మొబైల్ ఫోన్లలో ఎలాంటి కంటెంట్ చూస్తున్నరన్నది మీరెప్పుడైనా గమనించారా.? మీరు దానిపై కూడా దృష్టి సారించక తప్పదు..

కామన్ సెన్స్(Common Sense) మీడియా అనే స్వచ్ఛంద సంస్థ ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో 50 శాతం మంది టీనేజర్లు 13 ఏళ్లలోపు ఆన్‌లైన్ పోర్నోగ్రఫీని చూస్తున్నారని వెల్లడించింది. “టీన్స్ అండ్ పోర్నోగ్రఫీ” పేరుతో ఆ సంస్థ విడుదల చేసిన నివేదికలో పలు సంచలన విషయాలు బయటపడ్డాయి. సెప్టెంబర్ 2022లో 13 నుండి 17 సంవత్సరాల వయస్సు ఉన్న సుమారు 1,350 మంది టీనేజర్లపై ఓ సర్వే నిర్వహించారు.

ఇందులో 58 శాతం మంది అనుకోకుండా తాము ఆన్‌లైన్‌లో పోర్న్ చూశామని చెప్పారు. అలాగే ఇలాంటి కంటెంట్ ఇంటర్నెట్‌లో చూడాలనుకోలేదని తెలిపారు. అలాగే 63 శాతం మంది గతవారమే పోర్న్ చూశామని అంగీకరించారు. అటు టీనేజర్లలో 44 శాతం మంది మల్టీప్లేయర్ గేమ్స్ ద్వారా స్నేహితులైన వారి ద్వారా ఆన్‌లైన్ పోర్నగ్రఫీని తెలుసుకున్నామని.. తాము ఉద్దేశపూర్వకంగానే వీక్షించామని చెప్పుకొచ్చారు. ఇక 38 శాతం మంది ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా సైట్‌ల ద్వారా, 44 శాతం మంది డైరెక్ట్‌గా పోర్న్ వెబ్‌సైట్‌లలోకి వెళ్లి వీక్షించగా.. 34 శాతం మంది యూట్యూబ్, 16 శాతం మంది టీనేజర్లు సబ్‌స్క్రిప్షన్ సైట్‌లలో 18 శాతం మంది పోర్న్‌ను ఆన్‌లైన్‌ లైవ్ స్ట్రీమింగ్‌లో చూసినట్లు సర్వేలో తేటతెల్లమైంది. ఇదిలా ఉంటే.. పోర్న్ చూసినవారిలో 50 శాతం మంది తాము సిగ్గుపడుతున్నట్లు అంగీకరించగా.. 67 శాతం మంది యువకులు మాత్రం అలాంటిదేమి లేదని తెలిపారు. ఇక 45 శాతం మంది యువకులు ఆన్‌లైన్ అశ్లీలత సెక్స్ గురించి కొంత సమాచారాన్ని అందించిందని.. 27 శాతం మంది సెక్స్‌ను కచ్చితంగా చూపుతుందని భావిస్తున్నారట.

కాగా, భారత ప్రభుత్వం అశ్లీల సైట్లను నిషేధించిన సంగతి తెలిసిందే. ప్రతీ సందర్భంలోనూ పదుల సంఖ్యలో అలాంటి సైట్లపై బ్యాన్ విధిస్తోంది కేంద్రం. అయితేనేం అవి వేర్వేరు డొమైన్ల ద్వారా మళ్లీ పుట్టుకొస్తున్నాయి. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలు మొబైల్ ఫోన్లలో ఎలాంటి కంటెంట్ చూస్తున్నారో పర్యవేక్షించడమే కాదు.. వాటికి దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.(Source)

Follow Us
ఒక్క షేక్‌హ్యాండ్..మారిపోయిన సచిన్ జీవితం
ఒక్క షేక్‌హ్యాండ్..మారిపోయిన సచిన్ జీవితం
బెంగాల్ మాజీ డిప్యూటీ స్పీకర్ ఆశిష్ బెనర్జీ ఆత్మహత్య!
బెంగాల్ మాజీ డిప్యూటీ స్పీకర్ ఆశిష్ బెనర్జీ ఆత్మహత్య!
మీకు తెలియకుండా వీడియోలను రికార్డ్ చేస్తాయి.. జాగ్రత్త
మీకు తెలియకుండా వీడియోలను రికార్డ్ చేస్తాయి.. జాగ్రత్త
ప్రతి ఆఫీసుకీ వెళ్లి అవకాశాలు వెతుకున్నాడు.. ఇప్పుడు స్టార్ అయ్యా
ప్రతి ఆఫీసుకీ వెళ్లి అవకాశాలు వెతుకున్నాడు.. ఇప్పుడు స్టార్ అయ్యా
ఇన్ని ప్రయోజనాలా..? బార్లీ వాటర్ గురించి ఇది తెలిస్తే వదలరు
ఇన్ని ప్రయోజనాలా..? బార్లీ వాటర్ గురించి ఇది తెలిస్తే వదలరు
సెల్ఫీ పేరిట.. ఏడాది కూతురిని యమునా నదిలోకి విసిరేసిన తండ్రి!
సెల్ఫీ పేరిట.. ఏడాది కూతురిని యమునా నదిలోకి విసిరేసిన తండ్రి!
మందులకు గుడ్ బై చెప్పి వీటిని ఉడికించి తింటే షుగర్ పక్కా కంట్రోల్
మందులకు గుడ్ బై చెప్పి వీటిని ఉడికించి తింటే షుగర్ పక్కా కంట్రోల్
ఆగస్ట్ 15 నాడు సెంచరీ కొట్టిన తొలి భారతీయుడు పడిక్కల్ కాదా?
ఆగస్ట్ 15 నాడు సెంచరీ కొట్టిన తొలి భారతీయుడు పడిక్కల్ కాదా?
అటు అగ్నిపర్వతం బద్దలు.. ఇటు 235 సార్లు భూకంపం..
అటు అగ్నిపర్వతం బద్దలు.. ఇటు 235 సార్లు భూకంపం..
శ్రావణ వరలక్ష్మీ పూజ: లక్ష్మీదేవి అనుగ్రహం, సంపద రహస్యం ఇదే
శ్రావణ వరలక్ష్మీ పూజ: లక్ష్మీదేవి అనుగ్రహం, సంపద రహస్యం ఇదే