శబరిమల వివాదం.. 10 రోజుల్లో సుప్రీం విచారణ పూర్తి

శబరిమలలో మహిళల ప్రవేశంపై విచారణను సుప్రీంకోర్టు 10రోజుల్లో ముగించనుంది. తొమ్మిదిమంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం.. ఇది పూర్తిగా మత, విశ్వాస సంబంధమైన అంశమని, విచారణను ముగించడానికి మరింత సమయం తీసుకోజాలమని పేర్కొంది. శబరిమల సహా వివిధ మత మందిరాల్లో మహిళల ప్రవేశంపై గల అభ్యంతరాలు, తదితరాలపై తాము దృష్టి  సారిస్తామని ఈ ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న సీజేఐ జస్టిస్ ఎస్.ఎ . బాబ్డే తెలిపారు. విచారణ పది రోజులకు మించదని, ఎవరైనా మరింత వ్యవధి కావాలన్నా […]

శబరిమల వివాదం..  10 రోజుల్లో సుప్రీం విచారణ పూర్తి

Edited By:

Updated on: Jan 28, 2020 | 7:11 PM

శబరిమలలో మహిళల ప్రవేశంపై విచారణను సుప్రీంకోర్టు 10రోజుల్లో ముగించనుంది. తొమ్మిదిమంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం.. ఇది పూర్తిగా మత, విశ్వాస సంబంధమైన అంశమని, విచారణను ముగించడానికి మరింత సమయం తీసుకోజాలమని పేర్కొంది.

శబరిమల సహా వివిధ మత మందిరాల్లో మహిళల ప్రవేశంపై గల అభ్యంతరాలు, తదితరాలపై తాము దృష్టి  సారిస్తామని ఈ ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న సీజేఐ జస్టిస్ ఎస్.ఎ . బాబ్డే తెలిపారు. విచారణ పది రోజులకు మించదని, ఎవరైనా మరింత వ్యవధి కావాలన్నా అందుకు అనుమతించే పరిస్థితి లేదని ఆయన అన్నారు. ఈ బెంచ్ లో న్యాయమూర్తులు బీ. ఆర్  గవాయ్, సూర్యకాంత్ కూడా సభ్యులుగా ఉన్నారు.  కాగా-కోర్టు గతంలో ఇఛ్చిన ఆదేశాల ప్రకారం.. లాయర్ల సమావేశం జరిగిందని, అయితే ఆ మీటింగ్ ప్రధాన  లీగల్ సమస్యలను ఖరారు చేయలేకపోయిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ బెంచ్ దృష్టికి తెచ్చారు.  అందువల్ల ఈ అత్యున్నత ధర్మాసనమే దీన్ని పరిష్కరించవలసి ఉందన్నారు. అటు- ఆ సమావేశ వివరాలను తెలియజేయవలసిందిగా ధర్మాసనం ఆయనకు సూచించింది.