Supreme Court: కంప్యూటర్‌ వివరాల ఆధారంగా తొలగిస్తారా.. తెలంగాణలో రేషన్ కార్డుల ఏరివేతపై సుప్రీం ఆగ్రహం!

|

Apr 27, 2022 | 8:21 PM

తెలంగాణలో భారీ సంఖ్యలో రేషన్‌ కార్డులు ఏరివేతపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.

Supreme Court: కంప్యూటర్‌ వివరాల ఆధారంగా తొలగిస్తారా.. తెలంగాణలో రేషన్ కార్డుల ఏరివేతపై సుప్రీం ఆగ్రహం!
Supreme Court
Follow us on

Supreme Court on Telangana: తెలంగాణలో భారీ సంఖ్యలో రేషన్‌ కార్డులు ఏరివేతపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 19లక్షలకు పైగా రేషన్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంపై సీరియస్ అయ్యింది. రాష్ట్రంలో రేషన్‌ కార్డుల రద్దుపై దాఖలైన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. క్షేత్రస్థాయిలో సరైన పరిశీలన చేయకుండా రేషన్ కార్డులను ఎలా తొలగిస్తారని సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.

తెలంగాణాలో రేషన్ కార్డుల రద్దుపై సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్‌ ఎల్.నాగేశ్వరావు, జస్టిస్‌ బి.ఆర్. గవాయ్‌ల నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. తెలంగాణలో 19 లక్షలకుపైగా రేషన్‌ కార్డులను రద్దు చేయడంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షేత్రస్థాయిలో సరైన పరిశీలన చేయకుండా లక్షల సంఖ్యలో రేషన్‌ కార్డులు ఎలా తొలగిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. 2016 మార్గదర్శకాలతో క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలన జరపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. క్షేత్ర స్థాయిలో పరిశీలించకుండా కంప్యూటర్‌లో పొందుపరిచిన వివరాల ఆధారంగానే రేషన్ కార్డులను ఎలా రద్దు చేస్తారని తెలంగాణ ప్రభుత్వంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో లక్షల రేషన్‌ కార్డుల రద్దుకు ఎలాంటి ప్రమాణాలు పాటించారో పేర్కొంటూ అఫిడవిట్‌ సమర్పించాలని తెలిపింది. తదుపరి విచారణను ధర్మాసనం మూడు వారాలకు వాయిదా వేసింది.

Read Also…. AP Online: పారిశ్రామికవేత్తలకు గుడ్‌న్యూస్.. ఇకపై అన్ని ప్రభుత్వ సేవలు ఆన్‌లైన్‌లోనే..