Supreme Court: హెయిర్‌ కట్ సరిగా చేయనందుకు రూ.2 కోట్ల నష్ట పరిహారం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

|

Feb 09, 2023 | 9:39 AM

మోడల్‌కు సరిగ్గా హెయిర్‌ కటింగ్‌ చేయనందుకుగానూ రూ.2 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలనే జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆదేశాలను సుప్రీంకోర్టు మంగళవారం (ఫిబ్రవరి 7) తోసిపుచ్చింది..

Supreme Court: హెయిర్‌ కట్ సరిగా చేయనందుకు రూ.2 కోట్ల నష్ట పరిహారం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Compensation For Bad Hair Cut
Follow us on

మోడల్‌కు సరిగ్గా హెయిర్‌ కటింగ్‌ చేయనందుకుగానూ రూ.2 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలనే జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆదేశాలను సుప్రీంకోర్టు మంగళవారం (ఫిబ్రవరి 7) తోసిపుచ్చింది. న్యాయమూర్తులు అనిరుద్ధ బోస్, విక్రమ్ నాథ్‌లతో కూడిన ధర్మాసనం ఇలా వ్యాఖ్యానించింది.. ఐటీసీ మౌర్యలోని సెలూన్ సర్వీస్‌లో లోపాలపై జోక్యం చేసుకోబోమని కోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా మహిళలకు జుట్టు ఎంత విలువైనదో వివరించారు. మోడలింగ్‌ వృత్తిలో జుట్టును ఆస్తిగా పరిగణిస్తారన్నారు. హెయిర్‌ కటింగ్‌ సరిగ్గా చేయకపోవడాన్ని గాయం, మానసిక క్షోభ కింద పరిగణించవచ్చు. ఐతే అధికమొత్తంలో రూ.2 కోట్ల నష్టపరిహారం చెల్లించాలనే ఎన్‌సీడీఆర్‌సీ ఆదేశాలను పక్కనపెట్టడం తప్ప వేరే మార్గం లేదు. పరిహారం విషయంతో తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవల్సిందిగా కోరుతూ ఎన్‌సీడీఆర్‌సీకి సూచించింది. ఆష్నా రాయ్‌కి జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ఆమె గత ఎండార్స్‌మెంట్, మోడలింగ్ వర్క్, ఆమె అందుకున్న పారితోషికాలు, ఆమె గతం లేదా ప్రస్తుత, భవిష్యత్ అగ్రిమెంట్లలో ఏదైనా బ్రాండ్‌తో సమర్పించవల్సిందిగా కోరింది. తద్వారా నష్ట పరిహారాన్ని అంచనా వేయడానికి అవకాశం ఉంటుందని ధర్మాసనం పేర్కొంది.

కాగా ఆష్నా రాయ్ అనే మోడల్‌ 2018 ఏప్రిల్‌లో న్యూఢిల్లీలోని హోటల్ ఐఆర్‌సీ మౌర్య సెలూన్‌లో హెయిర్‌ కటింగ్‌కు వెళ్లారు. హెయిర్‌కట్‌కు సంబంధించి అన్ని సూచనలు చేసినప్పటికీ సదరు సెలూన్‌ హెయిర్‌కట్‌ సక్రమంగా చేయలేదు. దీంతో మోడల్‌ తన కెరీర్‌లో ముందుగు సాగలేక అవకాశాలు కోల్పోయినట్లు కెరీర్ నష్టం, ఆదాయ నష్టానికి గానూ రూ.2 కోట్ల పరిహారంతోపాటు, హోటల్‌ యాజమాన్యం నుంచి రాతపూర్వక క్షమాపణలు కోరుతూ ఎన్‌సీడీఆర్‌సీకి ఫిర్యాదు చేసింది. 2021 సెప్టెంబరులో రూ. 2 కోట్ల పరిహారం చెల్లించవల్సిందిగా కమిషన్‌ హోటల్‌కు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఐటీసీ లిమిటెడ్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.