
Online Game: ఆన్‌లైన్ గేమ్ కారణంగా చెన్నైలో ఓ విద్యార్థి బలయ్యాడు. ఆన్‌లైన్ గేమ్ వ్యవసనానికి గురైన 16 ఏళ్ల దర్శన్ అనే విద్యార్థి గంటల తరబడి గేమ్ ఆడుతూ కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఏమైందో తెలుసుకునే లోపే విద్యార్థి మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న వల్లియనుర్ పోలీసులు విద్యార్థి ఇంటికి చేరుకుని దర్శన్ మృతిపై విచారణ చేపట్టారు.
కాగా, ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్ గేమ్‌ల వల్ల విద్యార్థులు బలవుతున్నారు. గంటల తరబడి గేమ్ ఆడుతుండటం, దాని ప్రభావం మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తుండటంతో మరణిస్తున్నారు. ఇలాంటి గేమ్‌లు ఆడవద్దని నిపుణులు కూడా పదే పదే చెబుతున్నా విద్యార్థులు పెడచెవిన పెడుతూ గేమ్‌లకు బానిసలుగా మారుతున్నారు. పబ్జీగేమ్‌ల వల్ల కూడా ఎందరో విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలున్నాయి.
Also Read: