నీట్‌లో పొరపాట్లు, విద్యార్థిని ఆత్మహత్య

|

Oct 23, 2020 | 1:59 PM

నీట్‌ పరీక్ష నిర్వహణలో పొరపాట్లు దొర్లలేదని అధికారులు అంటున్నా.. తప్పిదాలు బయటపడుతూనే ఉన్నాయి.. వైద్య విద్య ప్రవేశం కోసం నిర్వహించిన నీట్‌ ఎగ్జామ్‌ చాలా మంది విద్యార్థులకు షాకిచ్చింది..

నీట్‌లో పొరపాట్లు, విద్యార్థిని ఆత్మహత్య
Follow us on

నీట్‌ పరీక్ష నిర్వహణలో పొరపాట్లు దొర్లలేదని అధికారులు అంటున్నా.. తప్పిదాలు బయటపడుతూనే ఉన్నాయి.. వైద్య విద్య ప్రవేశం కోసం నిర్వహించిన నీట్‌ ఎగ్జామ్‌ చాలా మంది విద్యార్థులకు షాకిచ్చింది.. మెరిట్‌ విద్యార్థులకు కూడా ఎంట్రన్స్‌లో సున్నా మార్కులు రావడం విచిత్రం.. మధ్యప్రదేశ్‌కు చెందిన విధి సూర్యవంశీ అనే అమ్మాయిది కూడా ఇదే పరిస్థితి.. పబ్లిక్‌ పరీక్షలో ఆమెకు అత్యున్నత మార్కులు వచ్చాయి.. నీట్‌ ఎగ్జామ్‌లో కూడా మంచి మార్కులే వస్తాయనుకుంది.. కాకపోతే కేవలం ఆరు మార్కులే రావడంతో బాగా కుంగిపోయింది.. డాక్టర్‌ కావాలనుకున్న తన కలలు ఛిద్రమయ్యే సరికి తన గదిలోని సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.. తమ కూతురుకు ఇంత తక్కువ మార్కులు వస్తాయని పేరంట్స్‌ కూడా అనుకోలేదు. తమ కూతురుకు మంచి మార్కులు వస్తాయనే గట్టి నమ్మకం వారిది.. అందుకే ఓఎమ్‌ఆర్‌ షీటును తెప్పించి చూశారు.. అందులో విధి సూర్యవంశీకి 720 మార్కులకు గాను 590 మార్కలు వచ్చాయి.. తమ కూతురు ప్రాణాన్ని అధికారులు నిలువునా తీశారని పేరంట్స్‌ ఆవేదన చెందుతున్నారు..