Earthquake in Uttarakhand: ఉత్తరాఖండ్‌లోని పిథోర్‌గఢ్‌లో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. దాంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. రోడ్డుపైన వాహనదారులు తమ వాహనాలను ఒక్కసారిగా ఆపేసి కిందకు దిగారు. భూమి కొన్ని సెకన్ల పాటు కంపించడంతో ఏం జరుగుతుందో అర్థం కాక హడలిపోయారు. కాగా, భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.0గా నమోదైంది. కాగా, పిథోర్‌గఢ్‌కు ఈశాన్యంగా 33 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర ఉన్నట్లుగా నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మోలజీ వెల్లడించింది. భూప్రకంపనల కారణంగా ఎటువంటి ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ వాటిల్లలేదని స్థానిక అధికారులు ప్రకటించారు.
ఇదిలాఉండగా, వారం రోజుల క్రితం దేశ రాజధాని న్యూఢిల్లీలో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. నోయిడా, గుర్గావ్, ఘజియాబాద్ పట్టణాల్లో భూమి కంపించింది. ఇక రాజస్థాన్‌లోనూ భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 4.3గా ఉందని ఎన్‌సీఎస్ అధికారులు ప్రకటించారు.
National Centre of Seismology Tweet:
Earthquake of Magnitude:4.0, Occurred on 19-02-2021, 16:38:32 IST, Lat: 29.88 & Long: 80.29, Depth: 8 Km ,Location: 33 km NNE of Pithoragarh, Uttarakhand, India for more information download the BhooKamp App https://t.co/OtVedRw7HA pic.twitter.com/kmYBZqldbU
— National Center for Seismology (@NCS_Earthquake) February 19, 2021
Also read: