ప్రభుత్వ ఉత్తర్వులు: టెస్ట్‌ రిజల్ట్ వచ్చే వరకు ‘హోమ్‌ క్వారంటైన్’‌లో ఉండాల్సిందే

| Edited By:

Jul 13, 2020 | 8:00 PM

కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న వేళ కర్ణాటక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పరీక్షలు చేయించుకున్న వారు.. వారి ఫలితాలు ప్రకటించే వరకు కఠినంగా

ప్రభుత్వ ఉత్తర్వులు: టెస్ట్‌ రిజల్ట్ వచ్చే వరకు హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాల్సిందే
Follow us on

కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న వేళ కర్ణాటక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పరీక్షలు చేయించుకున్న వారు.. వారి ఫలితాలు ప్రకటించే వరకు కఠినంగా హోమ్ ఐసోలేషన్‌లో గానీ క్వారంటైన్‌లో ఉండాలని కర్ణాటక ఆరోగ్య శాఖ సర్య్కులర్ జారీ చేసింది. అందులో ”కరోనా లక్షణాలతో శాంపిల్స్ ఇచ్చిన వారి నుంచి వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో పరీక్షలు చేయించుకున్న వారు ఫలితాలు వచ్చే వరకు హోమ్ ఐసోలేషన్‌/ క్వారంటైన్‌లో ఉండాలి. ఒకవేళ అలా కాకుండా బయటకు వెళ్లడం, నలుగురితో కలవడం, పనికి వెళ్లడం వంటి పనుల వలన సామాజిక వ్యాప్తి పెరిగే అవకాశం ఉంది. ఈ నిబంధనలు పాటించని వారిపై అంటువ్యాధుల చట్టం కింద కఠిన చర్యలు తప్పవు అని వివరించింది. కాగా కర్ణాటకలో 38,843 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 15,409 మంది కరోనాను జయించగా.. 684 మంది వైరస్‌తో చికిత్స పొందుతూ మరణించారు. మరోవైపు కరోనా నేపథ్యంలో రాజధాని బెంగళూరులో ఈ నెల 14 నుంచి 22 వరకు వారం రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్‌ని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.