Sporadic incidents happen: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. బాధితులందరికీ రాష్ట్ర సర్కార్ అండగా ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఘర్షణల్లో మొత్తం 16 మంది ప్రాణాలు కోల్పోయారని మమతా వెల్లడించారు. వారి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలు చొప్పున పరిహారం అందజేయనున్నామని తెలిపారు. ఈ మేరకు ఆమె గురువారం మీడియాతో మాట్లాడారు. చనిపోయిన వారిలో భారతీయ జనతా పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలతో పాటు, సంయుక్త మోర్చాకు చెందిన ఒకరు ఉన్నారని చెప్పారు. పోలింగ్ సమయంలో కూచ్‌బెహార్‌లో సీఐఎస్‌ఎఫ్ కాల్పుల్లో మరణించిన ఐదుగురికి చెందిన కుటుంబ సభ్యుల్లో ఒకరికి చొప్పున హోంగార్డు ఉద్యోగం ఇస్తామని మమత ప్రకటించారు. అలాగే కాల్పుల ఘటనపై సీఐడీ బృందం దర్యాప్తు ప్రారంభించిందని, నిజాలు నిగ్గు తేలుతాయని చెప్పారు.
మరోవైపు ఎన్నికల అనంతరం బీజేపీ నేతలసు పశ్చిమ బెంగాల్ పర్యటనను ఆమె తప్పుబట్టారు. రాష్ట్రంలో హింసకు కేంద్రమంత్రులు ఉసిగొల్పుతున్నారంటూ మమత వ్యాఖ్యానించారు. తాను అధికారంలోకి వచ్చి ఇంకా 24 గంటలకు కాకముందే లేఖలు, కేంద్ర బృందాలు రాక వంటివి జరిగిపోతున్నాయని అన్నారు. ముందు ఆ పార్టీ నేతలు ప్రజల తీర్పును స్వాగతించడం నేర్చుకోవాలని సూచించారు. కాగా, బీజేపీ ఎక్కువ ఓట్లు వచ్చిన చోట్లే హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని దీదీ ఆరోపించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో తాము కొవిడ్‌పై దృష్టి సారించాలనుకుంటున్నామని, తమను పనిచేసుకోనివ్వాలని మమత అన్నారు. ప్రజలు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నప్పడు బీజేపీ నాయకులు ఇక్కడికి రాలేదన్నారు. అయినా ప్రస్తుతం జగడాల జోలికి వెళ్లాలనుకోవట్లేదని సీఎం మమతా స్పష్టం చేశారు. ఎవరైతే బయటి నుండి వస్తున్నారో, అది కేంద్ర మంత్రులు అయినా, వారు ప్రత్యేక విమానాలలో వచ్చినా ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు తప్పనిసరి” అని మమతా బెనర్జీ అన్నారు.
ఏపీ ప్రజలకు ముఖ్య అలెర్ట్.. బ్యాంక్ టైమింగ్స్ లో మార్పులు.. వివరాలివే..
Viral News: గగుర్పొడిచే దృశ్యం.. ఒకే చోట కుప్పలు తెప్పలుగా చేరిన పాములు.. వీడియో వైరల్.!
ఈ ఫోటోలో ఎరను వేటాడేందుకు చిరుతపులి నక్కింది.. అది ఎక్కడ ఉందో కనిపెట్టగలరా.?