Accident: బాప్‌రే.. షాకింగ్ యాక్సీడెంట్.. హైవే రేయింలింగ్‌పై నిలిచిన కారు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

|

Jun 25, 2021 | 11:02 AM

Accident: మనం నిత్యం ఎన్నో రోడ్డు ప్రమాదాలను చూస్తుంటాం. కొన్ని ఘోరమైన, భయానకమైన రోడ్డు ప్రమాదాలు సంభవిస్తే.. మరికొన్ని..

Accident: బాప్‌రే.. షాకింగ్ యాక్సీడెంట్.. హైవే రేయింలింగ్‌పై నిలిచిన కారు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..
Car Crashed
Follow us on

Accident: మనం నిత్యం ఎన్నో రోడ్డు ప్రమాదాలను చూస్తుంటాం. కొన్ని ఘోరమైన, భయానకమైన రోడ్డు ప్రమాదాలు సంభవిస్తే.. మరికొన్ని షాకింగ్‌ అనిపించేలా, ఆశ్చర్యపోయేలా ఉంటాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లో షాకింగ్ యాక్సీడెంట్ కు సంబంధించి ఫోటో ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదృష్టావశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కానప్పటికీ.. ఆశ్చర్యకరంగా వారు నడిపిన కారు హైవే రేయిలింగ్‌పైకి ఎక్కి నిలిచిపోయింది. కొంచెం అటు ఇటు అయినా భారీ ప్రమాదమే జరిగి ఉండేదని ఆ ఫోటో చూస్తే చెప్పొచ్చు.

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆల్టో కారు నెర్చోక్ నుంచి ధరంపూర్ వైపు వెళుతోంది. కారులో తండ్రీ, కూతుళ్లు ఉన్నారు. అతని కుమార్తె వెనుకవైపు కూర్చొని ఉండగా.. తండ్రి డ్రైవింగ్ చేస్తున్నాడు. అయితే, జాబోట్ వంతెన సమీపానికి చేరుకోగానే.. భారీ మలుపు వచ్చింది. ఆ మలపులో అదుపు తప్పిన కారు పల్టీలు కొట్టింది. అలా మూడు అడుగుల ఎత్తైన హైవే రేయిలింగ్‌పే ఎక్కి ఆగిపోయింది. అదృష్టావశాత్తు దానిపై ఆగిపోవడంతో సరిపోయింది. లేదంటే ఆ కారు లోయలో పడి భారీ ప్రమాదమే సంభవించేది. కారు.. రేయిలింగ్‌పై ఆగిపోవడాన్ని గమనించిన కొందరు ప్రయాణికులు కారులో ఉన్న వారిని కాపాడి.. కారును కిందకు దించారు.

అయితే, ఇలాంటి ప్రమాదం అక్కడ కొత్తేం కాదని స్థానికులు చెబుతున్నారు. గతంలోనూ ఇలాంటి ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకున్నాయని చెబుతున్నారు. అనేక ప్రమాదాల్లో చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారని వారు గుర్తు చేశఆరు. ఈ ఘటనకు కొన్ని గంటల ముందే సర్కాఘాట్ సబ్‌డివిజన్ పరిధిలోనే ఓ కారు అదుపు తప్పి ఇంటిపైకి దూసుకుపోయింది. ఇదిలాఉంటే.. ప్రస్తుతం ప్రమాదానికి గురైన కారు ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ‘ఇదేం స్టంట్ రామా మావా’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘టైమ్ గాడ్ క్షణాల్లో బ్రతికిపోయారు’ అంటూ మరికొందరు నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు.

Also read:

Prakash Raj : గత ఎన్నికల్లో లోకల్ – నాన్ లోకల్ ఇష్యూ రాలేదు.. ఇప్పుడే ఎందుకు వస్తుంది.? : ప్రకాష్ రాజ్

Vastu Tips: ఉదయం లేవగానే వీటిని చూస్తే మీ రోజంతా దరిద్రమే.. అవెంటంటే..

SBI Recruitment 2021: స్టేట్‌ బ్యాంక్‌ ఆప్‌ ఇండియాలో ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేది జూన్‌ 28