Congress: ‘భారత్ కొద్దిమంది వ్యక్తుల సొత్తు కాదు’.. జైపూర్ సభలో సోనియా ప్రసంగం..

నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభాన్ని పెంపొందించడంలో ఈ ప్రభుత్వం ముందుందని బీజేపీని విమర్శించారు సోనియా గాంధీ. గత 10 సంవత్సరాలుగా దేశం ఏ మాత్రం పురోగతి సాధించలేదన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్ జైపూర్ లో పర్యటించారు ఆమె.

Congress: 'భారత్ కొద్దిమంది వ్యక్తుల సొత్తు కాదు'.. జైపూర్ సభలో సోనియా ప్రసంగం..
Sonia Gandhi
Follow us

|

Updated on: Apr 06, 2024 | 7:52 PM

నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభాన్ని పెంపొందించడంలో ఈ ప్రభుత్వం ముందుందని బీజేపీని విమర్శించారు సోనియా గాంధీ. గత 10 సంవత్సరాలుగా దేశం ఏ మాత్రం పురోగతి సాధించలేదన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్ జైపూర్ లో పర్యటించారు ఆమె. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని బీజేపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. భారతదేశం కొద్దిమంది వ్యక్తుల సొత్తు కాదని, అందరికీ చెందుతుందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ అన్నారు. ఏప్రిల్ 6 శనివారం జైపూర్‌లో ‘న్యాయ్’ మ్యానిఫెస్టోను ప్రారంభించిన తరువాత భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

గత పాలకుల వైఫల్యానికి దేశంలో నిరుద్యోగం, పేదరికం పెరిగిపోయిందన్నారు. అందుకు తమ కాంగ్రెస్ సహచరులు న్యాయం అనే దీపాన్ని వెలిగిస్తారని తెలిపారు. వేల తుఫానులు వచ్చినా వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగుతారన్న పూర్తి విశ్వాసం తనకుందని అన్నారు సోనియా. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య నిబంధనలను ఉల్లంఘిస్తోందని పేర్కొన్నారు. ఇది నియంతృత్వ పోకడలకు దారితీస్తోందని ఆమె వివరించారు. ప్రస్తుతం మన ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని దానిని కాపాడుకోవాల్సిన బాధ్యతన మనందరిపైన ఉందని సోనియా గాంధీ అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. ప్రధాని మోదీ ఏమీ చేయకుండా ప్రతిదానికీ క్రెడిట్‌ తీసుకుంటున్నారని ఖర్గే మండిపడ్డారు.

ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని తొలి హామీలో యువతకు ప్రధాని మోదీ చెప్పారని అన్నారు. పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. దేశంలోని యువతకు 20 కోట్ల ఉద్యోగాలు వచ్చాయా? అని ప్రశ్నించారు ఖర్గే. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామన్నారు. ఇంత మొత్తం ఖాతాల్లో జమ అయ్యిందా? అని అడిగారు. 70 ఏళ్లలో కాంగ్రెస్ దేశానికి ఐఐటీ, ఎయిర్‌పోర్టు, ఎయిమ్స్‌ను తీసుకొచ్చి దేశాభివృద్దిలో భాగమైందని తెలిపారు. మన దేశంలో నిరుద్యోగం అత్యధికంగా ఉందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. అగ్నిపథ్ పథకం, ద్రవ్యోల్బణం, పేదరికంపై ప్రియాంకా గాంధీ మాట్లాడారు. తామకు అధికారం ఇస్తే దేశాన్ని గతంలో కంటే అద్భుతమైన ప్రగతిలోకి తీసుకెళ్తామన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవాలని ప్రజలను కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
కోల్‌కతా, హైదరాబాద్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. వెదర్ రిపోర్ట్ ఇదే..
కోల్‌కతా, హైదరాబాద్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. వెదర్ రిపోర్ట్ ఇదే..
రేవ్ పార్టీలో హేమ కూడా..! ఫోటో రిలీజ్ చేసిన పోలీసులు..
రేవ్ పార్టీలో హేమ కూడా..! ఫోటో రిలీజ్ చేసిన పోలీసులు..
ఇకపై ప్రైవేట్‎గా డ్రైవింగ్ లైసెన్స్.. కొత్త రూల్స్ ఇవే..
ఇకపై ప్రైవేట్‎గా డ్రైవింగ్ లైసెన్స్.. కొత్త రూల్స్ ఇవే..
గతేడాది విలన్లు.. కట్‌చేస్తే.. తుఫాన్ ఫాంతో హీరోలు
గతేడాది విలన్లు.. కట్‌చేస్తే.. తుఫాన్ ఫాంతో హీరోలు
అరవింద సమేత ఫార్ములా వార్ 2 లో రిపీట్ చేస్తున్న తారక్ రామ్.
అరవింద సమేత ఫార్ములా వార్ 2 లో రిపీట్ చేస్తున్న తారక్ రామ్.
జూనియర్ ఎన్టీఆర్ కార్ల కలెక్షన్స్.. ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే
జూనియర్ ఎన్టీఆర్ కార్ల కలెక్షన్స్.. ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే
భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
ఆ ఇద్దరు నేతల ‌రాజకీయ భవిష్యత్తును తేల్చనున్న లోక్ సభ ఫలితాలు..
ఆ ఇద్దరు నేతల ‌రాజకీయ భవిష్యత్తును తేల్చనున్న లోక్ సభ ఫలితాలు..
ఈ ఆయిల్స్ ఉపయోగించారంటే.. జుట్టు పెరగడం పక్కా!
ఈ ఆయిల్స్ ఉపయోగించారంటే.. జుట్టు పెరగడం పక్కా!
తరచూ కళ్లు తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుందా?
తరచూ కళ్లు తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుందా?
భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..