20 May 2024

ఓ మై గాడ్.. ఆ దేశాన్ని వణికిస్తున్న కోవిడ్.. మాస్క్ ఈజ్ బ్యాక్

Narender.Vaitla

పూర్తిగా తగ్గిపోయిందని అనుకుంటున్న కరోనా మహమ్మారి మరోసారి వజృంభిస్తుందా అంటే ప్రస్తుతం జరుగుతోన్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధాన్ని ఇస్తున్నాయి. 

సింగపూర్‌లో కొత్త కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. ఈ కొత్త వేరియంట్‌ను ఫ్లిర్ట్‌గా పిలుస్తున్నారు. ఈ వైరస్‌ గాలితోపాటు నీటిలో కూడా జీవించగలదని అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది

సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం కేవలం వారం రోజుల్లో కోవిడ్‌19 కేసుల సంఖ్య ఏకంగా 25,900కి చేరినట్లు తెలిపారు

అయితే ఈ సంఖ్య 30వేలు దాటి ఉండొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక కోవిడ్‌ కారణంగా ఆసుపత్రిలో చేరుతోన్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు.

కేసులు భారీగా పెరుగుతోన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఉండే సమయంలో తప్పనిసరిగా మాస్కులను ధరించాలని సూచిస్తున్నారు

కాగా వచ్చే నాలుగు వారాల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. జూన్‌ చివరి నాటికి సింగపూర్‌లో కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. 

ఇదిలా ఉంటే ఈ కొత్త వేరియంట్‌ భారత్‌లోకి సైతం ప్రవేశించింది. ఇప్పటి వరకు దేశంలో 250 వరకు కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు.

మహారాష్ట్రలో 91 కేసులు, పుణెలో 51 కేసులు, థానేలో 20 కేసులు నమోదయ్యాయి. కరోనా కొత్త వేవ్‌ విజృంభిస్తున్న తరుణంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.