సిద్ధం అయిన బాలయ్య.. 

TV9 Telugu

20 May 2024

నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా తెరకెక్కుతోంది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు.

ఇందులో ప్రతినాయకుడు పాత్రలో యానిమల్ విలన్ బాబీ డియోల్ నటిస్తున్నారు.అయితే కథానాయకి ఎవరో ఇంకా తెలియాల్సి ఉంది.

రవి కిషన్, దుల్కర్ సల్మాన్, ప్రకాష్ రాజ్ మరియు పాయల్ రాజ్‌పుత్ తిదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదల ఈ మూవీ గ్లింప్స్ ఆకట్టుకుంది.

ఇదిలా ఉంటె ఈ సినిమా షూటింగ్‌కి కొంత కాలంగా బ్రేక్‌ పడింది. ఎన్నికల కారణంగా బాలయ్య బ్రేక్‌ తీసుకున్నారు.

ఈ నెలాఖరు నుంచి మళ్లీ కాల్షీట్‌ ఇచ్చారట.  భారీ యాక్షన్‌ సీక్వెన్స్ తో ఈ షెడ్యూల్‌ని మొదలుపెడతారని టాక్‌.

దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను దసరాకు విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.