అంతా అబద్ధమే..! SSMB29 టీం..

TV9 Telugu

20 May 2024

మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కినున్న సంగతి తెలిసిందే. అయితే షూటింగ్ ఇంకా మొదలుకాలేదు.

SSMB29 వర్కింగ్ టైటిల్ తో ఉన్న ఈ సినిమా భారీ బడ్జెట్ లో యాక్షన్ అడ్వెంచర్ గా తారకేక్కుతుందని సమాచారం.

జక్కన్న, మహేష్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల భారీ అంచనాలు పెట్టుకున్నారు. వీరిద్దరూ కలిసి చేస్తున్న తొలి చిత్రమిది.

ఇప్పటికే ఈ సినిమా కోసం మహేష్ బాబు నయా లుక్ లోకి మారిపోయారు. హాలీవుడ్ హీరోలను తలదన్నేలా కనిపిస్తున్నారు మహేష్.

మహేష్ బాబు, రాజమౌళి సినిమా గురించి అధికారికంగా తాము చెప్పేవరకు.. బయట వచ్చేవన్నీ అబద్ధాలే అంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు మేకర్స్.

దీనికి కారణం కొన్ని రోజుల కింద ఈ సినిమా క్యాస్టింగ్ డైరెక్టర్‌గా విరేన్ స్వామి వచ్చారంటూ కథనాలు వచ్చాయి.

ఇది అబద్ధం అంటూ నిర్మాణ సంస్థ శ్రీ దుర్గ ఆర్ట్స్ అధినేత కాజా లక్ష్మి నారాయణ ప్రెస్ నోట్ విడుదల చేసారు.

ఈ సినిమా కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. చివరిగా మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో నటించారు.