ఎమర్జెన్సీ మళ్లీ వాయిదా..

TV9 Telugu

20 May 2024

బాలీవుడ్ స్టార్ నటి కంగన రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న బయోపిక్ సినిమా ఎమర్జెన్సీ.

భారతదేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో జరిగిన ఎమర్జెన్సీ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు కంగన.

ఇందులో జయప్రకాష్ నారాయణ్ గా అనుపమ్ ఖేర, అటల్ బిహారీ వాజ్‌పేయిగా శ్రేయాస్ తల్పాడే, మొరార్జీ దేశాయ్‌గా అశోక్ ఛబ్రా, పుపుల్ జయకర్ పాత్రలో మహిమా చౌదరి నటిస్తున్నారు.

ఇంకా సంజయ్ గాంధీగా విశాక్ నాయర్, కమలా నెహ్రూగా జెబా హుస్సేన్, దూరదర్శన్ రిపోర్టర్‌గా మన్‌వీర్ చౌదరి నీటిస్తున్నారు.

మణికర్ణిక ఫిల్మ్స్ సంస్థలో కంగనా రనౌత్, రేణు పిట్టి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈజ్ మై ట్రిప్ కూడా ఇందులో భాగమైంది.

తమిళ సంగీత దర్శకుడు జీ.వి. ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నారు. జీ స్టూడియోస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న చిత్రమిది.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూన్ 14న రిలీజ్ చేస్తామని ఇప్పటికే చెప్పారు మూవీ మేకర్స్.

అయితే కొన్ని అనివార్య కారణాలతో ఈ సినిమాను మరోసారి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు చిత్ర దర్శక నిర్మాతలు.