Tax Notice: చిరు వ్యాపారికి బిగ్‌షాక్‌.. రూ.141 కోట్ల ట్యాక్స్ కట్టాలంటూ నోటీసు..!

బాధితుడు సుధీర్ చెప్పిన ప్రకారం ఇదే తరహాలో 2022లోనూ తనకు సంబంధం లేని అమ్మకాలపై సీజీఎస్టీ కార్యాలయం నుంచి నోటీసు అందిందని, అప్పుడే తాను ఆ కంపెనీలతో ఎలాంటి సంబంధం లేనట్లు పన్ను అధికారులకు వివరణ ఇచ్చానని పేర్కొన్నారు. ఈ సంస్థలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. అయితే ఇటీవల

Tax Notice: చిరు వ్యాపారికి బిగ్‌షాక్‌.. రూ.141 కోట్ల ట్యాక్స్ కట్టాలంటూ నోటీసు..!
Tax Notice

Updated on: Sep 01, 2025 | 2:20 PM

ఓ చిరువ్యాపారికి ఊహించని బిగ్‌షాక్‌ ఇచ్చింది ఐటీ శాఖ. ఏకంగా అతనికి రూ.141 కోట్ల ట్యాక్స్‌ కట్టాలంటూ నోటీసు జారీ చేశారు అధికారులు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బలంద్‌షహర్‌లో వెలుగులోకి వచ్చింది. బులంద్‌షహర్‌ ప్రాంతానికి చెందిన సుధీర్‌ అనే వ్యక్తి స్థానికంగా చిన్న కిరాణా దుకాణం నడుపుతున్నాడు. ఈ క్రమంలోనే అతడికి రూ.141 కోట్లకు పైగా అమ్మకాలపై ఆదాయపు పన్ను విభాగం అధికారుల నుంచి వచ్చిన నోటీసు చూసి కంగుతిన్నాడు. చిరు వ్యాపారం చేసుకుంటున్న తనకు ఢిల్లీలో తన పేరుతో నమోదైన ఆరు సంస్థలకు సంబంధించిన రూ.141 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు అందడంతో అతడు షాక్‌కు గురయ్యాడు.

గుర్తుతెలియని వ్యక్తులు తన పాన్‌కార్డును దుర్వినియోగం చేసి.. ఆరు కంపెనీలను నడుపుతున్నారని బాధితుడు ఫిర్యాదు చేశాడు. నకిలీ పత్రాలను ఉపయోగించి తనకు తెలియకుండానే ఈ సంస్థలను ఏర్పాటు చేశారని, వాటిలో దేనితోనూ తనకు ఎటువంటి సంబంధం లేదని అతడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

బాధితుడు సుధీర్ చెప్పిన ప్రకారం ఇదే తరహాలో 2022లోనూ తనకు సంబంధం లేని అమ్మకాలపై సీజీఎస్టీ కార్యాలయం నుంచి నోటీసు అందిందని, అప్పుడే తాను ఆ కంపెనీలతో ఎలాంటి సంబంధం లేనట్లు పన్ను అధికారులకు వివరణ ఇచ్చానని పేర్కొన్నారు. ఈ సంస్థలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. అయితే ఇటీవల జులై 10న మళ్లీ రూ.1,41,38,47,126 విలువైన అమ్మకాలు చేశాడని మరోసారి నోటీసు అందినట్టుగా సుధీర్ పోలీసులకు వివరించాడు. అందులో తన పేరు, చిరునామా, పాన్ నంబర్ మాత్రమే కాకుండా, ఢిల్లీలో ఆరు కంపెనీల యజమానిగా తనను చూపించారని వాపోయాడు. నా పత్రాలను ఉపయోగించి మోసం జరిగింది. నా నెలవారీ ఆదాయం రూ. 10-12 వేలు మాత్రమేనని చెప్పాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…